• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అల్లూరులో నూతన టీడీపీ కార్యాలయం ప్రారంభం

NLR: అల్లూరులో టీడీపీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభసభ్యుడు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. అల్లూరు కేంద్రంగా టీడీపీ బలోపేతానికి కొత్త కార్యాలయం దోహదపడుతుందన్నారు.

March 1, 2026 / 07:38 PM IST

మనస్థాపంతో ఒకరి ఆత్మహత్య

KMR: రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన శంకర్ మనస్థాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం..  కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ఆయన కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపం చెందగా.. తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

March 1, 2026 / 07:38 PM IST

‘కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్’

PDPL: కేంద్ర బడ్జెట్ కార్మికులు, కర్షకులు, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. యాకయ్య అన్నారు. మంథనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బడ్జెట్ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

March 1, 2026 / 07:37 PM IST

త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

RR: షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రజల అవసరాలను గుర్తించిన కౌన్సిలర్ రిజ్వానా బేగం ముబారక్ అలీ ఖాన్ బోర్ ఏర్పాటు చేశారు. బోర్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని వెంటనే పరిష్కారం చూపడం అభినందనీయమని ప్రశంసించారు.

March 1, 2026 / 07:37 PM IST

రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

KDP: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో కోర్టు ఉద్యోగి భక్తుల మధుసూదన్ రావు (47) మృతి చెందినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహంరాజు తెలిపారు. CI వివరాలు.. సిద్ధవటం అటవీ చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం సాయంత్రం సిద్ధపటం కోర్టు నందు లోక్ అదాలత్ సెక్షన్లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు బైకుపై బద్వేల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు.

March 1, 2026 / 07:36 PM IST

‘జిల్లా అభివృద్ధిలో శ్యామల దేవి సేవలు గొప్పవి’

ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసిన శ్యామల దేవి పదవి విరమణ పొందారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో శ్యామలాదేవి చేసిన సేవలు గొప్పవని అన్నారు. ప్రతి ఉద్యోగి వృత్తిలో నిమగ్నమై పని చేయాలని కోరారు.

March 1, 2026 / 07:34 PM IST

కొడంగల్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

VKB: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ దీపక్ తివారీ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి.. ఆదివారం కొడంగల్‌లో పర్యటించారు. R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు.

March 1, 2026 / 07:32 PM IST

విండీస్ బ్యాటింగ్ డెప్త్‌ మాకు తెలుసు: భారత కోచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోంది. ఇందులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కతే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నాడు. అనవసరమైన ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని తెలిపాడు.

March 1, 2026 / 07:31 PM IST

అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ విప్‌కు వినతి

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పలు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులుప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయం, పెద్దమ్మ ఆలయం అభివృద్ధి, సీసీ రోడ్లు, గుండ్లపల్లె తెలుగు పల్లె నుంచి గ్రామాన్ని కలిపే ఒర్రె మీదుగా సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.

March 1, 2026 / 07:31 PM IST

‘రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయండి’

SKLM: రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నుంచి ఆమదలవలస రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు సాగాలని కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

March 1, 2026 / 07:30 PM IST

IND vs WI: క్యాచ్‌ డ్రాప్‌.. తొలి వికెట్ మిస్

వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త ఫీల్డింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను మిస్ చేశాడు. రోస్టన్ ఛేజ్ (15*) ఇచ్చిన సులువైన క్యాచ్‌ నేలపాలు చేశాడు. దీంతో వికెట్ లేకుండానే పవర్‌ప్లే ముగిసింది. ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లకు 45/0గా ఉంది. క్రీజ్‌లో ఛేజ్ (20*), షై హోప్ (25*) ఉన్నారు.

March 1, 2026 / 07:30 PM IST

వెల్లలూరు టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణకు నివాళులు

GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు టీడీపీ అధ్యక్షుడు గణిపిశెట్టి రామకృష్ణ మాతృమూర్తి లక్ష్మీ పద్మావతి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫోన్‌లో గణిపిశెట్టి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్థివదేహానికి నివాళులర్పించారు.

March 1, 2026 / 07:30 PM IST

‘భవిష్యత్ యుద్ధ స్వభావం సాంకేతికత ఆధారంగా మారుతోంది’

MDCL: భవిష్యత్ యుద్ధ స్వభావం సాంకేతికత ఆధారంగా మారుతోందని ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ఎంసీఏఎంఈలో రోబోటిక్స్, అటానమస్ డ్రోన్ సిస్టమ్స్, సంకలిత తయారీపై రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో రక్షణ దళాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

March 1, 2026 / 07:29 PM IST

వెటర్నరీ డాక్టర్స్ స్పోర్ట్స్ మీట్

కరీంనగర్‌లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. TNGO ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డి, JAC కన్వీనర్ TGO ప్రెసిడెంట్ మడిపల్లి కాళిచరణ్ పాల్గొన్నారు.

March 1, 2026 / 07:29 PM IST

‘రాష్ట్ర ప్రభుత్వం కోకో గింజల ధరల పాలసీ ప్రకటించాలి’

ELR: కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ధర తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం డిమాండ్ చేశారు. కోకో గింజల ధరల పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

March 1, 2026 / 07:29 PM IST