• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి పోలీసుల భద్రత

HYD: గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి పోలీసులు భద్రత పెంచారు. ఇరాన్ -ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడ భద్రత ఇచ్చారు. దీంతో 70 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటువైపుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అమెరికన్లు ఉండే హోటల్‌పైన ప్రత్యేక దృష్టి పెట్టారు.

March 2, 2026 / 01:20 PM IST

రోడ్డు ప్రమాదంలో బాలికకు గాయాలు

MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక గాయపడింది. తూప్రాన్‌లో నివాసముండే రాణి (9) పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా ఆటో రిక్షా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక రాణి తీవ్రంగా గాయపడగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు వైద్య సేవలు అందజేస్తున్నారు.

March 2, 2026 / 01:20 PM IST

ఎద్దుల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్య

NDL: శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల సందర్భంగా నంది కొట్కూరు (M) కొణిదెలలో సోమవారం పెద్ద బండ లాగుడు ఎద్దుల పోటీ కమిటీ వారు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్య గిత్త జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజలు చేసి, టెంకాయ కొట్టి పోటీలు ప్రారంభించారు. గెలుపొందిన మొదటి ఎడ్ల జతకు రూ. 80 వేలు అని ప్రకటించారు.

March 2, 2026 / 01:19 PM IST

కారును ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

బాపట్ల-చీరాల హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న ఓ కారును వెనుక నుంచి పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 01:18 PM IST

సిరిపురం ZPHSలో సందడిగా ‘ఫేర్‌వెల్ డే’

SRPT: నడిగూడెం మండలం సిరిపురం ZPHSలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక అట్టహాసంగా జరిగింది. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

March 2, 2026 / 01:18 PM IST

91వ రోజుకు చేరిన ముంపు బాధితుల దీక్షలు

NGKL: గ్రామాలు ముంపునకు గురికావద్దని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన దీక్షలు సోమవారంతో 91వ రోజుకు చేరాయి. అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

March 2, 2026 / 01:18 PM IST

నిజాయితీ చాటుకున్న మచ్చేందర్

SRD: కంగ్టి మండలం తుర్కవడ్గంకు చెందిన మచ్చేందర్ కంగ్టిలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కనిపించిన ఓ కవర్‌ను తీసి చూడగా అందులో తులం బంగారం కమ్మలు ఉన్నాయి. వెంటనే కంగ్టి ఠాణాకు నేడు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అప్పుడే వారు విచారణ చేపట్టి , బంగారం కమ్మలు దుర్గారాజు వని గుర్తించి అప్పగించారు. మచ్చేందర్ నిజాయితికి SI అభినందించారు.

March 2, 2026 / 01:17 PM IST

రైతులకు యూరియా ఇబ్బందులు

BHNG: యాదగిరిగుట్ట పట్టణ పరిసర ప్రాంతాల్లో యాసంగి సీజన్ ప్రారంభంలోనే యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలకు యూరియా వేసే సమయంలో సరైన సరఫరా లేక డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి, యూరియా రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

March 2, 2026 / 01:17 PM IST

కడపలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి: మక్బూల్ భాషా

కడప నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతోందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మక్బూల్ భాషా అన్నారు. నిల్వ మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేసి మందు పిచికారీ చేయాలని, కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దోమల కాటుతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

March 2, 2026 / 01:17 PM IST

అందరాని ద్రాక్షగా మారిన పేదోడికి వైద్యం

KMM: మధిర పట్టణంలో ఇటీవల ప్రారంభమైన వంద పడకల ప్రభుత్వాసుపత్రి అప్పుడే సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. చూడటానికి కోటలా ఆసుపత్రి ఉన్న పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. దీంతో మధిరలో పేదోడికి వైద్యం అందరాని ద్రాక్షగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.

March 2, 2026 / 01:16 PM IST

‘బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలి’

BDK: బెల్ట్ షాపుల నియంత్రణపై బీజేపీ జిల్లా అధ్యక్షులు చుక్కపల్లి బాలాజీ సోమవారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బూర్గంపాడు మండల పరిధిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయని గుడి, బడి, తేడా లేకుండా సమయపాలన పాటించకుండా అర్ధరాత్రి వరకు విక్రయాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తక్షణమే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 2, 2026 / 01:15 PM IST

చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత: SP

ASF: మహిళలు,చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ SP నితిక పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం ల ద్వారా 54 హాట్ స్పాట్ లలో ,19 అవగాహనా సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళలు ర్యాగింగ్ ,ఈవ్ టీజింగ్, హింసకు గురి అయినట్లయితే జిల్లా షీ టీమ్ ను సంప్రదించాలని సూచించారు.

March 2, 2026 / 01:14 PM IST

మంగళపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

NLG: నకిరేకల్ మండలం మంగళపల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం బచ్చుపల్లి గంగాధర్ రావు, సర్పంచు గాదరి జయమ్మ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షలతో సంఘబంధం భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మార్కెట్ డైరెక్టర్ బొల్లెద్దు లక్ష్మయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బుజంగరావు, ఉపసర్పంచ్ రామాలింగారావు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:14 PM IST

ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు

CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించి మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. అత్యవసర నంబర్లు 100, 112 వినియోగం, సైబర్ జాగ్రత్తలు, బాలికల రక్షణ చట్టాలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. మార్చి 8 వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగతాయన్నారు.

March 2, 2026 / 01:13 PM IST

హోలీ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలకు ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. యువత చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వారిపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు.

March 2, 2026 / 01:12 PM IST