కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని సోమవారం విశాఖపట్నం ట్రాన్స్ కో విజిలెన్స్ ఎస్పీ కింజరపు రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
KRNL: నగరపాలక సేవలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కమిషనర్ పీ.విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు సంబంధించి 19 ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ రమ్యతో పాటు ఆమె భర్తను కులం పేరుతో దూషించిన పాముల రాజేష్ అనే వ్యక్తిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెక్కొండ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ELR: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా స్థాయీ అధికారులతో నిర్వహించారు. ప్రజలు దగ్గర నుంచి అర్జీలను స్వీకరించి, నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
W.G: నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణిస్తామనే నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా భావిస్తామని STU జిల్లా అధ్యక్షులు సాయి వర్మ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. హాజరు నమోదు కావడం ఆలస్యం అవ్వడం అనేది అనేక సాంకేతిక కారణాలు ఉంటున్నాయని అన్నారు. సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండడం, యాప్ సరిగా పని చేయకపోవడం అనేకసార్లు చూస్తూ ఉన్నాం, దీనికి టీచర్లల్ని బాధ్యులుగా చేయడం తగదన్నారు.
SRPT: ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ సునీత ఇవాళ తెలిపారు. ఈ మేరకు గోడపత్రికను ఆవిష్కరించారు. ఏప్రిల్ 31 వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. వివరాలకు 9154298695 నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
MBNR: జడ్చర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు నరసింహ యాదవ్ ఢిల్లీలో అరెస్ట్ కావడంపై యాదవ సంఘం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏఐ సమ్మేళనంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపిన ఆయణ్ణు పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజులు గడుస్తున్నా, కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. విడుదలకు చర్యలు వారు తీసుకోవాలన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో భారత మాజీ దిగ్గజ క్రికెటర్లతో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లతో VVS లక్ష్మణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ముఖ్యంగా, యువ ఆఫ్‌స్పిన్నర్ల కోసం హర్భజన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెడ్ మాస్టర్ తారాసింగ్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయని కొనియాడారు.
VZM: రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం నెల్లిమర్ల మండలం ధనానపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి-మీ హక్కు”కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
SRPT: తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో నేతలు యాతాకుల రాజన్న, ఏపూరి రాజు మాట్లాడారు. రాజ్యసభ సీటు కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలని, తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు అన్నారు.
ATP: గుత్తి కౌన్సిల్ హాల్లో సోమవారం స్వచ్చంద్ర, స్వర్ణాంధ్ర పై వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శుభ్రత మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్‌ని ప్రతి ఇంటి, పరిసరాలలో వాడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో ప్రజలు సమర్పించిన 8 అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని RDO ఎం.సుజాత అధికారులు సూచించారు. సోమవారం రాజమండ్రిలోని RDO కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రెవిన్యూ క్లినిక్, PGRSకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై విచారణ చేసి పరిష్కరించాలని సూచించారు.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల విధులపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.