TG: లడ్డూ అంశానికి సంబంధించి శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా తీర్మానం ఇచ్చామని, అయినాసరే ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతుందని ఆయన ప్రశ్నించారు. శాసన మండలిలో తమ పార్టీని తట్టుకోలేక అధికారపక్షం పారిపోతుందన్నారు.
KMM: వైరా మున్సిపాలిటీ 8 వార్డు సీనియర్ టీడీపీ నాయకులు రామారావు తనయుడు అశోక్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అశోక్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
CTR: రొంపిచర్ల మండలంలోని పంచాయతీల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని చిత్తూరు జడ్పీ CEO రవికుమార్ నాయుడు ఆదేశించారు. రొంపిచర్లలో పన్ను వసూలును మంగళవారం ఆయన పరిశీలించారు. రొంపిచర్లలో రూ.7లక్షలు వసూలు కావాల్సి ఉందని.. త్వరగా కలెక్ట్ చేయాలని సూచించారు. పజులు పేటలో సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. అనంతరం రామిరెడ్డిగారి పల్లెలో నీటి పథకాన్ని తనిఖీ చేశారు.
MBNR: మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ సమీపంలోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని రైతులు తెలిపారు. వాగు నుంచి ఒకచోట ఇసుక డంపు చేసి రాత్రి వేళలో టిప్పర్ ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఎంత జరుగుతున్న పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
SKLMఫ ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రధాన సమస్యలు, వంశధార–బహుదా నదుల అనుసంధానం ద్వారా సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MLA తెలిపారు.
సత్యసాయి: పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్‌ను మంత్రి సవిత ఏర్పాటు చేయించారు. పట్టణంలో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఈ బస్సు షెల్టర్ ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినందుకు మంత్రి సవితకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
NLR: ప్రజలు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీలకు సహకరించాలని బుచ్చి ఎంపీడీవో రంతులయ్య కోరారు. ఇసుకపాలెం, మునులపూడిలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో కలిసి మంగళవారం ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్దేశించిన కాలంలో సిబ్బంది ప్రజల నుంచి ఇంటి పనులు వసూలు చేయాలని ఆయన సూచించారు.
TG: ప్రధాని పదవిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ప్రధాని కుర్చీ కుటుంబ వారసత్వం కాదు అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. నిజాం శైలి దర్బార్ కాదు అని విమర్శించారు. అయినా ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదు అని తెలిపారు. దేశం అభివృద్ధి రంగులతో హోలీ జరుపుకుంటుంటే.. కాంగ్రెస్ అవినీతి మసితో మసకబారిందన్నారు.
KRNL: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక జిల్లా సాధన ఉద్యమ గాయకుడు మేలన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి జేఏసీ నాయకులు ఇవాళ రూ.5,000 సాయం అందించారు. ఆయన మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జేఏసీ నాయకులు ఆరోపిస్తూ.. రూ.10 లక్షల పరిహారంతో పాటు, ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని 108వ రిలే నిరాహార దీక్షలో నేతలు డిమాండ్ చేశారు.
W.G: ఆపదలో ఉన్నవారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో దుర్గాపురంకి చెందిన దండెల నాగబాబుకు రూ. 3,50,000 రాయలంకి చెందిన మానుకొండ కిరణ్ కుమార్‌కు రూ. 2,51,288 ఎల్వోసీల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజనసంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జగదీశ్ నాయక్, తమ సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశారని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ తెలిపారు.
శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నారి మణి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి అని అన్నారు.
NZB: ఎడపల్లి మండలం సరయు ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎడపల్లికి చెందిన బాలయ్య, ఎరాజ్పల్లికి చెందిన నారాయణ ఒకరినొకరు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గంగామణి, అనిల్ వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
WNP: యూఏఈలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ, న్యాయ సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో కన్వీనర్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. MP ధర్మపురి అర్వింద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ఈ సేవలను ప్రశంసిస్తూ, యూఏఈలోని భారతీయులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరితగతిన సాయం అందించడమే ఈ ఫోరం లక్ష్యమన్నారు.
AP: రాష్ట్రంలో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. కర్నూలు బాలాజీ నగర్‌లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.