SDPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ప్రకారం.. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారానికి చెందిన పవన్ బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఎడపల్లి 108 ఈఎంటీ గంగామణి, పైలట్ అనిల్ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ నిట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మహమ్మద్ ఫారుక్ హష్మీ జపాన్‌లో ఈ నెల 17-19 తేదీల్లో జరిగే IVSP-26 అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ సదస్సులో ఆయన “ట్రాన్స్‌ఫార్మర్-ఆగ్మెంటెడ్ ఎఫిషియంట్నెట్ V2B3” సాంకేతికత ఆధారంగా మొక్కల వ్యాధులను గుర్తించే ఏఐ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను చిట్యాల మున్సిపాలిటీలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. పాలకవర్గం ముందు రోజే వార్డుల్లో చేపట్టవలసిన పనులపై సమీక్ష జరిపారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30 లకు 12వ వార్డులో ప్రారంభం కానుంది.
RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇవాళ ఉదయం ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ క్రూజర్ వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
నంద్యాల: పట్టణం, రూరల్ పరిధిలోని రేషన్ డీలర్లతో ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో శుక్రవారం ఉదయం జరగనున్న శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ వసతి గదులు, లాడ్జీలు నిండిపోవడంతో భక్తులు గుడి చెరువు పార్కింగ్ ప్రాంగణం వంటి బహిరంగ ప్రదేశాల్లోనే బస చేశారు. రాజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లి ప్రాథమిక పాఠశాల HM శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, అప్పుడప్పుడు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ డీఈవో ఇందిర విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే అని రిపోర్ట్ ఇవ్వడంతో సస్పెండ్ చేశారు.
NRPT: నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి, లంకాల గ్రామాల్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు గురువారం భూమిపూజ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఎంపీ నిధులతో ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల రాత్రి వేళల్లో గ్రామాల్లో వెలుగుల సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
TG: ఖమ్మం(D)లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MLA వాకిటి శ్రీహరి సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
SRPT: ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సామాన్యుడిలా జీవించే నిబద్ధత గల నాయకుడు, ‘ఆదివాసి ముద్దుబిడ్డ’ గుమ్మడి నర్సయ్య గురువారం మఠంపల్లిలో సందడి చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన, స్థానిక టీ స్టాల్ వద్ద సాదాసీదాగా టీ తాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నిరాడంబరతను చూసి ముగ్ధులైన స్థానికులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆయనతో ఫోటోలు దిగి ముచ్చటించారు.
కాకినాడ జిల్లాలో త్వరలో చేపట్టనున్న జనగణనపై ఈనెల 6 నుంచి 8 వరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు ల్యాప్ ట్యాప్‌లతో హాజరుకావాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జనగణనపై పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గ YCP పరిశీలకులుగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఎటువంటి ఛార్జీ లేకుండా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
E.G: గృహ నిర్మాణ పనుల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పనులు మరింత వేగవంతం చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం కార్యాలయంలో వెలుగుబంద, కానవరం, నిడిగట్ల లేఅవుట్లలో నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు, గుత్తేదార్లు గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.