AP: ధర్నా చేసిన ఉద్యోగులపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని హోంమంత్రి అనిత తెలిపారు. రాజధాని రైతులపై కూడా కేసులు నమోదు చేసిందని విమర్శించారు. విచారణలో 11 కేసులు, పెండింగ్ 39, ముగింపు దశలో 170 కేసులు ఉన్నాయన్నారు. తప్పుడు కేసులు అని తేలితే వెంటనే కేసులు కొట్టివేస్తున్నామని చెప్పారు. కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
TG: నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్ష రాసిన 16 ఏళ్ల విద్యార్థిని, కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తన తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేజీబీవీ (KGBV)లో చదువుతున్న ఈ విద్యార్థిని ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
NTR: MLC మొండితోక అరుణ్ బుధవారం శాసనమండలిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంపై ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ORR నిర్మించేందుకు NTR జిల్లాలో భూసేకరణ ప్రక్రియ, రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై అరుణ్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి జనార్ధనరెడ్డి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
వనపర్తి మండలం రాజనగరం పీఎస్సీఎస్ రైతులకు పంపిణీకి 450 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని సీఈవో మహేందర్ తెలిపారు. ఈరోజు 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని, అవసరం ఉన్న రైతులు బుకింగ్ చేసుకుని యూరియా పొందాలని కోరారు. యూరియా తీసుకునేందుకు రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్‌లతో రావాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంతాన భాగ్యం కోసం భక్తులు తరలివచ్చి వేణుగోపాలుని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. నేడు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించాలని ఆలయ సిబ్బంది తెలిపారు.
MNCL: మందమర్రి పట్టణంలోని శ్రీపతి నగర్‌లో పది రోజుల క్రితం పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త రోడ్డు వేయడంతో ప్రత్యామ్నాయ దారి లేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ATP: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గురు తిప్పే రుద్రస్వామిని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు దర్శించుకున్నారు. మార్చి 6 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ శుభం కలగాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలపై బుధవారం తేనె టీగలు దాడి చేశాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు చేస్తున్న 10 మంది కూలీలపై దాడి చేశాయి. బాధితులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పులి పాలవ్వ అనే మహిళకు తీవ్రగాయాలు అయినట్లు తెలిపారు.
PDPL: పెద్దపల్లి మండలం అందుగులపల్లి నుంచి దేవునిపల్లి రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. రోడ్డు పనులు నెలల తరబడి జరుగుతుండడంతో ఈ మార్గాన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
RR: ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీ గోడను అమానుషంగా కూల్చిన ఘటనలో షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంచర్ లో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా గోడ కూల్చారని వెంచర్ యజమాని యాదగిరి షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని బాధితుడు యాదగిరి తెలిపారు. తనకు సంబంధించిన వెంచర్ ప్రహరీని కూల్చిన 13 మందిపై కేసు నమోదు చేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా 17వ డివిజన్ హరనాధపురం, బలరాం నగర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు, పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి అసెస్మెంట్ విధించాలన్నారు. ఖాళీ స్థలముల పన్నులు విధించాలని ఆదేశించారు.
GNTR: మంగళగిరిలోని అమరావతి క్రికెట్ స్టేడియంను బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. వచ్చే మే నాటికి స్టేడియం పనులన్నీ పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ మైదానం త్వరలోనే క్రీడాభిమానులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.
కడప నగరంలో ఆప్‌కి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఒక దాత సహాయంతో 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, రవ్వ, చక్కర, మసాలా పదార్థాలు, సేమియాలు, బాదం, కాజు, నెయ్యి తదితరాలతో కూడిన కిట్లు 25 మందికి అందజేశారు. రంజాన్ మాసంలో పేదలకు ప్రభుత్వమే రంజాన్ తోఫా అందించాలని మక్బూల్ కోరారు.
TG: జిల్లా కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. క్షేత్ర పర్యటనలు చేయని పక్షంలో ప్రజల సమస్యలు అర్థం కావని, పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లపై నిర్ణయం ఉంటుందని హెచ్చరించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.