• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వాయు లింగేశ్వరుని సేవలో డిప్యూటీ సీఎం సలహాదారు

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు రత్నం విచ్చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 01:12 PM IST

పశ్చిమలో రెచ్చిపోతున్న ‘లంచా’వతారాలు

W.G: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

February 24, 2026 / 01:10 PM IST

దుబ్బగూడెంలో భారీ చోరీ

BHPL: మహదేవపూర్(M)దుబ్బగూడెంలో సోమవారం రాత్రి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక రైతు పోత సమ్మయ్య ఇంట్లో గుర్తు తెలియని చొరబడి బీరువా తెరిచి 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. కూతురి వివాహం కోసం ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన సొమ్మును కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

February 24, 2026 / 01:10 PM IST

హిందువులు నేర్చుకోవాలి: Dy. CM పవన్

AP: తిరుమల వేంకటేశ్వరస్వామికి కాకుండా ఇలాంటి తప్పు వేరే మతంలో జరిగి ఉంటే ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేవారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మిగిలిన మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులు కులాలు కులాలుగా ఉంటారని, అందుకే వైసీపీ నాయకులకు ధైర్యమన్నారు. నెయ్యి కల్తీపై అప్పటి టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని తెలిపారు.

February 24, 2026 / 01:09 PM IST

‘విద్యార్థులు మంచి ఉపన్యాసకులగా తయారవ్వాలి’

VZM: విద్యార్థులు మంచి ఉపన్యాసకులుగా తయారు కావాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డా. మిరియాల కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం వక్త పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.

February 24, 2026 / 01:09 PM IST

డీఎస్పీని కలిసిన నూతన కౌన్సిలర్

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.

February 24, 2026 / 01:09 PM IST

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

SDPT: జగదేవ్ పూర్ మండలం అలీరాజ్పేటలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి, వ్యవసాయ అధికారి వసంతరావు, యువరైతు శ్రీనాథ్ రైతులకు ప్రకృతి సేద్యంలోని మెళకువలను వివరించారు. రసాయన రహిత సాగుతో భూసారం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:08 PM IST

పెంట్లంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ కారం శివ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. శ్రీ భవాని కంటి ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు చూపు సమస్యలు, మసక చూపు, కంటి నొప్పులు వంటి సమస్యలను పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారు. 

February 24, 2026 / 01:08 PM IST

పరిశీలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు: పొన్నం

HYD: ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఆందోళనలకు దూరంగా సంస్థ పురోగతి, కార్మిక సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాల కోసం కలిసి పనిచేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 01:08 PM IST

వేగంగా కొనసాగుతున్న NIT అభివృద్ధి పనులు

HNK: పట్టణ కేంద్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత క్యాంపస్‌లో రూ.137.77 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతుండగా..మరో రూ.618.79 కోట్లతో ఆధునిక సౌకర్యాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 2047 నాటికి విద్యార్థుల సంఖ్యను రెండింతలు చేయాలనే లక్ష్యంతో రెండో క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి.

February 24, 2026 / 01:08 PM IST

రైల్వే గేటు తాత్కాలిక మూసివేత

NLG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చిట్యాల – శ్రీరామ్ నగర్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్-30 ని తాత్కాలికంగా మూసివేశారు. కి.మీ. 53/5-6 వద్ద ఉన్న ఈ గేటును ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈరోజు నుంచి బుధవారం సా. వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను చూసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 01:07 PM IST

ఎర్రగుంట్ల సుందరయ్య నగర్‌లో నాకాబందీ

KDP: తెల్లవారుజామున ఎర్రగుంట్ల సీఐ కె.విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇళ్లను సోదాలు చేశారు. ఎలాంటి రికార్డు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.

February 24, 2026 / 01:06 PM IST

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL:ఎ లిగేడు మండలం శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు 28 లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. గ్రామ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. ఫ్రీ బస్సు, రైతు బోనస్, వైద్య సాయం, ఇందిరా ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

February 24, 2026 / 01:06 PM IST

భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?

బ్రిస్బేన్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళల జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన టీమ్ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసి.. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 215.

February 24, 2026 / 01:06 PM IST

వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ ప్రారంభం

NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను తెలుసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

February 24, 2026 / 01:05 PM IST