SDPT: గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. పిల్లలు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.
GNTR: పొన్నూరు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో ఆన్‌లైన్ ద్వారా సింగిల్ నంబర్ జూదం నిర్వహిస్తున్న వెంకటరామ సుబ్బారావును గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి రూ.2,500 నగదు, ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం నిందితుడిని స్థానిక అర్బన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ASR: జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అందుబాటులో ఉన్న వాటితో, పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నీతి అయోగ్ ప్రోగ్రాంలో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 నిర్వహించారు.
BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
JN: వెల్దండ రిజర్వాయర్ నుంచి నర్మెట్ట, అమ్మాపురం, అక్కరాజుపల్లి, తరిగొప్పుల గ్రామాలకు కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు రుణమాఫీ చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
KDP: తమ డిమాండ్ల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆప్కాస్ కార్మికులతో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
T20 WCలో భాగంగా కొలంబో వేదిగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గ్రూప్-2లో ఇప్పటికే లంక తమ తొలి మ్యాచ్ ఓడగా.. పాక్, కివీస్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో ఇవాళ విజయం సాధించడం ఇరుజట్లకు తప్పనిసరిగా మారింది. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
KNR: ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సిపి గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, చలాన్లపై వాహనదారులు ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులకు నిర్ణీత కాలంలో న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
SRCL: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం విస్తృతంగా ప్రకటించారు. ముందుగా స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడమే లక్ష్యం అన్నారు.
కృష్ణా: రాష్ట్రంలో విద్యార్థుల కోసం సమగ్ర ఇంటర్న్‌షిప్ విధానాన్ని రూపొందించేందుకు యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్ర లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో MLA యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఇంటర్న్‌షిప్‌లపై ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదని, విద్యార్థులకు సరైన గైడెన్స్, మానిటరింగ్ తప్పనిసరన్నారు.
AP: అసెంబ్లీని సందర్శించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ, అమ్మలాంటి మాతృభాష తెలుగును మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.
TG: HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలో వర్షం పడుతుంది. తేలికపాటి వర్షమేనని, గరిష్టంగా 5-10 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.
HNK: ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం, గూడెప్పాడు, మల్కపేట గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు.
NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా వెంకటేష్ గౌడ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ వీఆర్ నుంచి ధన్వాడకు వెంకటేష్ గౌడ్ బదిలీపై వచ్చారు. ధన్వాడ ఎస్సై రాజశేఖర్ రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకై కృషి చేస్తానని తెలిపారు.