• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మామిడి చెరువుకు సాగునీరు విడుదల చేయాలి’

NTR: ఏ.కొండూరు మండలం, చీమలపాడు పెద్ద చెరువు నుంచి రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని మామిడి చెరువుకు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. మామిడి చెరువులో నీరు సరిపోక వరి, మిరప పంటలు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీరు విడుదల చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

March 10, 2026 / 09:53 AM IST

జిల్లా వాసికి కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు

BHPL: పట్టణ కేంద్రానికి చెందిన పద్మశాలీ సమాజ నాయకుడు రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మశాలీల ఐక్యత, సామాజిక సేవలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. కాగా ఈనెల 15న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో BSA జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా రాజేంద్రప్రసాద్ అవార్డు అందుకోనున్నారు.

March 10, 2026 / 09:53 AM IST

బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఇంఛార్జ్ ఏవో

ప్రకాశం: అర్థవీడులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని మండల ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి జి. శివగంగ ప్రసాద్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వన్ ఆఫీసర్ వన్ ఇనిస్ట్యూట్‌లో భాగంగా బీసీ బాలుర వసతి గృహన్ని పరిశీలించినట్లు అయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుపట్టిక, భోజనం యొక్క మెనూ కాపీలను ఆయన పరిశీలించారు.

March 10, 2026 / 09:52 AM IST

BREAKING: ఒకే రోజు రూ.10 వేలు పెరిగిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 పెరిగి రూ.1,48,850 పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

March 10, 2026 / 09:52 AM IST

వినాయక స్వామి విగ్రహం ధ్వంసం.. గ్రామస్థుల ఆగ్రహం

PLD: నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో సోమవారం గుర్తు తెలియని దుండగులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుండగులు విగ్రహాన్ని పెకలించి, గుడి సమీపంలో పారవేసినట్లు స్థానికులు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే స్వామివారి విగ్రహాన్ని ఇలా అవమానించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

March 10, 2026 / 09:52 AM IST

KCRపై ఉద్యమ కేసు కొట్టివేత

TG: సకల జనుల సమ్మె సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.2011లో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ సహా 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 10, 2026 / 09:52 AM IST

వాహనాలు తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు

NRPT: నారాయణపేట పట్టణ శివారు యాదగిరి రోడ్డులో సోమవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు వాహనాలు తనిఖీలు చేపట్టినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి, కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, సేవిస్తున్నా సమాచారం ఇవ్వాలన్నారు.

March 10, 2026 / 09:51 AM IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్యమృగాల భయం

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్యమృగాల సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కల్లూరు, కుప్పం, యర్రావారిపాలెం ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతుండగా, బైరెడ్డిపల్లె మండలంలో తాజాగా చిరుత ఒక ఆవును చంపినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారు.

March 10, 2026 / 09:50 AM IST

నేడు పోలవరం రానున్న మంత్రి

ELR: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ వెట్రి‌సెల్వి తెలిపారు. ఉదయం 9 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం పోలవరం నుంచి రాజమండ్రి బయలుదేరి వెళతారన్నారు.

March 10, 2026 / 09:49 AM IST

ఏపీలో రెండు ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు

AP: రాష్ట్రంలో మరో రెండు ఎకనామిక్ రీజియన్లు (అమరావతి, తిరుపతి) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్.. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈవోగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను నియమించింది.

March 10, 2026 / 09:49 AM IST

భారీగా తిరుమల హుండీ ఆదాయం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి సుమారు 12-15 గంటల సమయం పడుతోంది.

March 10, 2026 / 09:48 AM IST

పోలవరంలో పర్యటించనున్న మంత్రి నిమ్మల

AP: పోలవరంలో ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం పనులపై పలు సూచనలు చేసి.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించనున్నారు.

March 10, 2026 / 09:48 AM IST

తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు

BPT: అద్దంకి ఏకలవ్య నగర్‌కు చెందిన ST మహిళలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. స్థానిక వ్యాపారి రామాంజనేయులు బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని KVPS జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు.

March 10, 2026 / 09:47 AM IST

ఖమ్మంలో ఉద్రిక్తత.. 43 మందిపై కేసు

KMM: ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సహా మొత్తం 43 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా సోమవారం అనుమతి లేకుండా ధర్నా చేపట్టి, వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.

March 10, 2026 / 09:47 AM IST

బంగారం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు

BPT: అద్దంకి ఏకలవ్య నగర్‌కు చెందిన ST మహిళలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. స్థానిక వ్యాపారి రామాంజనేయులు బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని KVPS జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు.

March 10, 2026 / 09:47 AM IST