• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు విశాఖలో జగన్ పర్యటన

AP: మాజీ సీఎం జగన్ రేపు విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లానున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను జగన్ ఆశీర్వదించనున్నారు.

March 3, 2026 / 12:40 PM IST

జిల్లా బీజేపీ అధ్యక్షుడి మాతృమూర్తి మృతి

RR: జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి వనిపల్లి భారతి దేవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ భారతి దేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాహెబ్ నగర్ శ్మశానవాటికలో భారతీ దేవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 3, 2026 / 12:40 PM IST

పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళలకు ఉచిత వైద్య శిబిరం

ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మహిళా పోలీసులు, ఆటో డ్రైవర్లు, డ్వాక్రా మహిళలకు గుండె, కంటి, సాధారణ ఆరోగ్య పరీక్షలు చేశారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 3, 2026 / 12:37 PM IST

చిన్నారులతో హోలీ జరుపుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హోలీ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు చిన్నారులతో కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేశారు. పండుగ పూట చిన్నారులతో సరదాగా గడుపుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరభావంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 12:36 PM IST

‘డీటీసీపీ లేని వెంచర్లలో ప్లాట్లు కొనరాదు’

SRD: కంగ్టి మండల పరిధిలో కొంతమంది ఫామ్ ప్లాట్ పేరుతో వెంచర్లను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారని, అలాంటి వాటిని నమ్మి మోసపోకూడదని పంచాయతీ కార్యదర్శి సుభాష్ సూచించారు. డీటీసీపీ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్లు కొనుగోలు చేయరాదని ఆయన హెచ్చరించారు. డీటీసీపీ అనుమతులు లేకుండా పొందాల్సిందేనని తెలిపారు.

March 3, 2026 / 12:36 PM IST

శ్రీ జెండా బాలాజీ మందిరం మూసివేత

నిజామాబాద్ గోల్ హనుమాన్ శ్రీ జెండా బాలాజీ మందిరాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో జీ. వేణు వెల్లడించారు.

March 3, 2026 / 12:35 PM IST

కొత్తబురుజులో సీఎం చంద్రబాబు పర్యటన

KRNL: ఈనెల 9న సీఎం చంద్రబాబు కొత్తబురుజు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు ఇవాళ ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. సీఎం నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

March 3, 2026 / 12:35 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాలివే!

ఫోర్బ్స్ జాబితా ప్రకారం, బ్రిటన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఏకంగా రూ.4.07 లక్షల కోట్ల విలువతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసంగా అగ్రస్థానంలో ఉంది. ముంబైలోని ముకేష్ అంబానీ ఇల్లు ‘ఆంటిలియా’ రూ.16,640 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌లోని విల్లా లియోపోల్డా, విల్లా లెస్ సెడ్రెస్, లెస్ ప్యాలెస్ బుల్లెస్ వరుసగా ఉన్నాయి.

March 3, 2026 / 12:34 PM IST

జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

VZM: జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజ్ లో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకుని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

March 3, 2026 / 12:33 PM IST

జనగామ పట్టణ అభివృద్ధికి సహకరించాలని వినతి

JN: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జనగామ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రతాపరెడ్డి, పలువురు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలిశారు. జనగామ పట్టణ అభివృద్ధికి సహకరించాలని, జనగామ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. అనంతరం కౌన్సిలర్లను మంత్రి సన్మానించారు.

March 3, 2026 / 12:33 PM IST

పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత

NRPT: మక్తల్ పట్టణంలోని ఒక జ్యువెలర్స్ షాప్ నుంచి వివాహ కార్యక్రమం నిమిత్తం ఒక జత బంగారు కమ్మలు, ఒక బంగారు ముక్కుపుడక, ఒక జత వెండి మట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆభరణాలు ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి అందజేశారు.

March 3, 2026 / 12:31 PM IST

రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

NLG: జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

March 3, 2026 / 12:31 PM IST

ఐక్యత, సామరస్యానికి హోలీ ప్రతీక: మంత్రి

MDK: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దామోదర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. హోలీ రంగుల్లా ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకున్నారు. రాష్ట్రం శాంతి, అభివృద్ధి, సౌభాగ్య మార్గంలో మరింత ముందుకు సాగాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 12:31 PM IST

‘అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది’

MNCL: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని ఆయన కోరారు.

March 3, 2026 / 12:31 PM IST

కందుల, శెనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం చాకిరాలలోని రామలింగేశ్వరస్వామి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కందులు, శెనగలు కొనుగోలు కేంద్రాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 3, 2026 / 12:30 PM IST