AP: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్ రోడ్డు విషయం కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి రేకులపల్లి వెళ్లే రోడ్డు డైవర్షన్ రోడ్డు కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం డైవర్షన్ రోడ్డును ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సర్పంచ్ సరోజినీ దేవి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొదటి రోజు చిట్యాల పురపాలికలోని 12వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కమిషనర్ దండు శ్రీను ప్రతిజ్ఞ చేశారు. వీరందరూ స్వయంగా చీపుర్లు పట్టి వార్డులో చెత్తాచెదారాన్ని క్లీన్ చేశారు.
NDL: బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలో గొర్రెలు తొక్కిసలాట జరగడంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు నీటి గుంతలోకి నీరు త్రాగడానికి వెళ్లడంతో ఒకదానికి ఒకటి తొక్కిసలాట జరగడంతో.. 80 గొర్రెలు అక్కడే మృత్యువాత పడటంతో బాధితులు నగేష్, ఆంజనేయులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పొంగులేటి తెలిపారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి మరియు ఏపీఎంఎస్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశమని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.
BDK: ఆళ్లపల్లి రైతు వేదిక ప్రాంగణంలో మార్చి 8న(ఆదివారం) ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పీహెచ్‌సీ వైద్యులు అర్వపల్లి రేవంత్ తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఎముక, దంత తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
T20 WC ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీలుగా ICC 8 మంది పేర్లను ప్రకటించింది. ఈ రేసులో సంజూ శాంసన్‌తో పాటు విల్ జాక్స్(ENG), షాహిబ్దాదా ఫర్హాన్(PAK), లుంగి ఎంగిడి(SA), మార్క్రమ్(SA), రచిన్ రవీంద్ర(NZ), వాన్ స్కాల్క్‌విక్(USA), టిమ్ సీఫర్ట్(NZ) ఉన్నారు. అసోసియేట్ జట్ల నుంచి ఎంపికైన స్కాల్క్‌విక్ ఈ టోర్నీలో ఇప్పటికీ టాప్ వికెట్ టేకర్(13)గా ఉన్నాడు.
AP: అచ్యుతాపురం సెజ్‌కు 5 వేల ఎకరాలు సేకరించారని మంత్రి భరత్ వెల్లడించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ప్రకారం పరిహారం అడుగుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో సంప్రదింపులు చేయాలని కోరారు. కాకినాడ సెజ్ కోసం 4 వేల ఎకరాలు తీసుకున్నారని.. అక్కడ కూడా కొందరు రైతులకు పరిహారం అందలేదన్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను MEO నగరం మల్లేశం శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. స్థానిక వసతులు సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల నమోదు, ఉపాధ్యాయుల వివరాలు, మెనూ ప్రకారం భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు తదితర రికార్డులను ఆయన పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఇందులో ప్రిన్సిపాల్ తిరుపతయ్య, VP ఫణిందర్, విట్టల్ ఉన్నారు.
విజయనగరం మండలంలోని కేఎల్ పురం నుంచి ద్వారపూడి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. జిల్లా కేంద్రం నుంచి ఇటుగా నిత్యం రాకపోకలు సాగుతాయి. పలుచోట్ల భారీ మలుపులున్నాయి. హెచ్చరిక బోర్డులు గానీ, వీధి దీపాలు గానీ లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు
VKB: తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి దుర్వాసన రాకుండా రీసైక్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డును 99 డేస్ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఆయన పరిశీలించారు. పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త సేకరణ ప్రణాళికతో చేపట్టాలన్నారు.
SRCL: వేములవాడ శాత్రాజుపల్లికి చెందిన సెక్యూరిటీ గార్డ్ ప్రశాంత్ గుండెపోటుతో మృతి చెందారు. తిప్పాపూర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయన, రాత్రి అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. యువకుడైన ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
AKP: భవిష్యత్తులో వచ్చే తుఫానులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడుతూ.. 2014-19 మధ్య చంద్రబాబు 219 తుఫాన్ షెల్టర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. పైగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.
SRPT: చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ళ రమేష్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.