BDK: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు.
TPT: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురువం బాబు సత్యవేడు నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీల నుంచి భారీగా టిప్పర్ల ద్వారా తరలింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో రోడ్లు ధ్వంసమై దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్వారీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
NRML: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టిక ఆహారం అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
SKLM: ఈనెల 16వ తేదీ నుండి జరగనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఎంఈవో-1 ఉప్పాడ శాంతారావు పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట మండలం మాకివలస జడ్పీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల సమయంలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు.
TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. దానం పిటిషన్‌పై స్పీకర్ తుదివాదనలు వింటున్నారు. దానం, కడియం కేసులో ఒకేసారి స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.
WNP: వనపర్తిలో నేటి నుంచి మూడు రోజుల పాటు విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ క్రీడలోనైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంతమంది ఒకేసారి చూడటం ఇదే అత్యధికం. రేపు జరిగే ఫైనల్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
BDK: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ భవనాన్ని స్వయంగా పరిశుభ్రం చేశారు.
KMM: గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో ఒకపూట పోషకాహారం తీసుకోవాలని సూపర్‌వైజర్ సూచించారు. మధిర-1 సెక్టార్ పరిధిలోని ఆర్సీఎం చర్చ్ రోడ్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఆరోగ్య లక్ష్మి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ రంగా రూప-శ్రీనివాస్ పాల్గొన్నారు.
VZM: జిల్లాలోని 26 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం గెడ్డకంచరాం గ్రామంలో ఎంపీ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎంపీకి అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న జరగనున్న రథోత్సవ ఏర్పాట్లను జిల్లా SP సతీష్ కుమార్ శనివారం పరిశీలించారు. రథం సాగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.
KDP: కమలాపురంలో శనివారం బీజేపీ నేత గోవిందు రైతులతో కలిసి వారి పొలాలను సందర్శించారు. వారి సమస్యలు, పంట పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకున్నారు. రైతు సంక్షేమం దేశ అభివృద్ధికి పునాది అని, రైతుల కష్టాలు తగ్గేలా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. బీజేపీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
MHBD: ఆత్మ మరిపెడ డివిజన్ ఆధ్వర్యంలో చీకటాయపాలెం, దంతాలపల్లిలో రైతులకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ ఛైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు.