• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాద మృతుని వివరాల గుర్తింపు

KMR: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు మంగళవారం సేకరించారు. మృతుడు మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (42)గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు.

March 3, 2026 / 02:48 PM IST

పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే: రష్మిక

నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

March 3, 2026 / 02:48 PM IST

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే బాధితురాలు వీణ

అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలు వీణ హైకోర్టును ఆశ్రయించారు. MLA తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను మోసం చేశారని, పైగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తల్లితో ఫిర్యాదు చేయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. వీణపై నమోదైన కేసు చెల్లదని పేర్కొంది.

March 3, 2026 / 02:47 PM IST

హోలీ.. ఈ పూలు మీకు గుర్తున్నాయా?

హోలీ పండుగలో మోదుగు(గోగు) పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రంగులు చర్మానికి సురక్షితమైనవి, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ పువ్వులను దేవుడి పూజలోనూ వినియోగిస్తారు. ఈ పువ్వులోని తీయని రసాయనం తేనె వంటి అనుభూతిని ఇస్తుంది. మీరూ ఇలా చేశారా? కామెంట్ చేయండి.

March 3, 2026 / 02:45 PM IST

ఈమనిలో హెల్త్ & వెల్నెస్ సెంటర్లకు శంకుస్థాపన

GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రెండు నూతన హెల్త్ & వెల్నెస్ (విలేజ్) సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 72 లక్షల వ్యయంతో ఈ కేంద్రాలు నిర్మించనున్నారు. కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించి, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

March 3, 2026 / 02:45 PM IST

ప్రజాభవన్‌లో సీతక్కను కలిసిన మంచు లక్ష్మి

HYD: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను సినీ నటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్‌గా తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించనున్న కార్యక్రమానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి, సీతక్కకు వివరించారు.

March 3, 2026 / 02:44 PM IST

రేపల్లెలో తాగునీటి పనులు 90 శాతం పూర్తయ్యాయి: మంత్రి

BPT: రేపల్లె నియోజకవర్గంలో రూ. 31 కోట్లతో చేపట్టిన 28 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

March 3, 2026 / 02:43 PM IST

మృతదేహంపై కుక్కల దాడి.. మాజీ మంత్రి ఆగ్రహం

MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, కొత్త భవనం పూర్తయినా వాడుకలోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య మేనని మండిపడ్డారు. మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందని విమర్శించారు.

March 3, 2026 / 02:43 PM IST

‘అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి’

BDK: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను తక్షణమే ఆపాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అశ్వరావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో ఆదివాసి దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు పలు విషయాలను వెల్లడించారు. తాము గత 35 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు వెల్లడించారు.

March 3, 2026 / 02:43 PM IST

శవాన్ని తిన్న కుక్కలు.. BRS మండిపాటు

TG: జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పీక్కు తినడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తెస్తామన్న మాటను ఇవాళ నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ ఆస్పత్రిలో మార్చురి గది నిర్మాణం పూర్తయి.. ఏడాదిన్నర అవుతున్న ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రారంభానికి నోచుకేలేదని విమర్శించారు.

March 3, 2026 / 02:41 PM IST

ఎస్ఆర్ఆర్ కళాశాలలో హోలీ సంబరాలు

KNR: కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో హోలీ పండుగను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. క్యాంపస్ అంతా రంగుల హరివిల్లు వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు పరస్పరం రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నృత్యాలతో యువత సందడి చేశారు. ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

March 3, 2026 / 02:41 PM IST

అరెస్టులతో ఉద్యమం ఆగదు: సీఐటీయూ

TPT: పుత్తూరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. “చలో విజయవాడ” సందర్భంగా విజయవాడలో అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 02:40 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల హోలీ సంబరాలు

JGL: మెట్‌పల్లి పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విధి నిర్వహణ ఒత్తిడిని పక్కనపెట్టి, ఉద్యోగులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బస్టాండ్ పరిసరాల్లో యువత, ఉద్యోగులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.

March 3, 2026 / 02:38 PM IST

అభిషేక్ జట్టును గెలిపించాలి: మాజీ క్రికెటర్

అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక సూచనలు చేశాడు. అభిషేక్ షాట్ సెలక్షన్‌పై దృష్టి పెట్టాలని తివారీ సూచించాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకోవద్దని హెచ్చరించాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. సెమీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని ఆకాంక్షించాడు.

March 3, 2026 / 02:38 PM IST

శివాజీ మహారాజ్ నూతకడం నూతన కమిటీ ఎన్నిక

MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం గ్రామ సర్పంచ్ మురిమడుగుల కవితా రాజన్న ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా జెల్ల స్వామి, ఉపాధ్యక్షులుగా ఏదుల వంశీ, కోశాధికారిగా ఏదుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మామిడి రాజన్న, ప్రచార కార్యదర్శిగా జెల్ల భీమయ్య, తదితరులను ఎన్నుకున్నారు.

March 3, 2026 / 02:37 PM IST