KNR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల PHC వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. PHC ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంతంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ADB: సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలకు పరోక్షంగా సహకరిస్తూ మోసాలు చేస్తున్న నిందితులు ఇర్ఫాన్, సాహిల్, అనాస్ ను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
NGKL: కుమ్మెరలో జరిగిన చిన్నారి మౌనిక మృతి ఘటనపై విచారణకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మంగళవారం రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రామానికి చేరుకుని, ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల నుంచి కమిషన్ నివేదిక కోరింది.
TG: హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రహదారుల అభివృద్ధి, తాగునీటికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.4 వేల కోట్లకుపైగా నిధులతో వీటిని చేపట్టనున్నారు. HMDAలో మరో నాలుగు గ్రామాలను చేర్చేందుకు.. నియోపొలిస్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమి కేటాయింపునకు.. అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కూర్మాసనం(తాబేలు భంగిమ) వెన్నెముకను బలోపేతం చేస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా ఇది వీపు, భుజాలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడి తెచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మెదడుకు, శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించి విశ్రాంతి ఇస్తుంది.
KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.HYD దోమలగూడలో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్‌పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్‌లో తమ సామర్థ్యాన్ని చాటారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించారు.
వరంగల్ నగరంలో చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్‌లోని కాకతీయ కాలనీ, కేయూసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త క్లియర్ చేయని ఇద్దరు జవాన్లకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు.
W.G: మొగల్తూరులో ప్రసిద్ధి గాంచిన మామిడి ఫలసాయాన్ని వేలం వేసుకునేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మామిడి రైతులు, వర్తకులు సోమవారం అధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీవో త్రిశూల పాణి, తహసీల్దార్ రాజ్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. మామిడి విక్రయాల కోసం వేలం కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
NDL: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు ఎంపీ డా. బైరెడ్డి శబరి, కలెక్టర్ జి.రాజకుమారి సహకారంతో సోమవారం సాగునీరు విడుదల చేయించారు. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయగా.. పంటలు రక్షించబడ్డాయని రైతులు ఎంపీ, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: గరికపాడు గ్రామంలో సోమవారం రాత్రి పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఏప్రిల్ నెలలో రూ. 20 లక్షలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాను, కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ కళాశాలలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 302 మంది పరీక్ష రాయగా 294 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 27లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలన్నారు.
TG: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని DJF వ్యక్తం చేసింది. గతంలో ప్రతి జిల్లా ఐదుగురికి, ఎడిషన్ జర్నలిస్టులకు అడ్రెడిటేషన్ కార్డులు వచ్చాయని వెల్లడించింది. ఇప్పుడు, కేవలం ఎడిషన్ సెంటర్‌కు 4 మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమని పేర్కొంది. ఈ నిబంధన వల్ల చాలామంది డెస్క్ జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దూరం అవుతున్నారని తెలిపింది.
NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
BPT: పంగులూరు మండలం ముప్పవరంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 91 మందికి మొత్తం రూ. 77.33 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయని మంత్రి పేర్కొన్నారు.