• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు జగన్మోహిని కేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

BHPL: కాటారం మండల కేంద్రంలోని జగ్గయ్యపల్లె గ్రామ శివారులోని వాగులో ఇటీవల లభించిన 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి శిలా విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామంలోకి తరలించారు. ఈ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుందని గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు తెలిపారు.

March 9, 2026 / 09:45 AM IST

మంత్రి లోకేష్‌‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

ATP: T20WC ఫైనల్స్‌లో టీమిండియా ఆటగాళ్లను ప్రోత్సహించిన మంత్రి నారా లోకేష్‌ను తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మన జట్టుకు మద్దతు తెలపడం క్రీడా స్ఫూర్తికి, దేశభక్తికి నిదర్శనమని అన్నారు. నాయకులు క్రీడలను ప్రోత్సహించడం వల్ల యువతలో స్ఫూర్తి నిండటంతో పాటు జాతీయ గౌరవం పెరుగుతుందని కొనియాడారు.

March 9, 2026 / 09:43 AM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ వసూళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించేలా దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కాగా కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కాగా ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది.

March 9, 2026 / 09:43 AM IST

5K విజేతలకు నగదు పురస్కారం

SRD: జిన్నారం మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం 5 కే రన్‌ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. ఈ రన్‌లో జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు జీవన్, తేజ, రుత్విక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి నగదు పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ తిరుపతి ఉన్నారు.

March 9, 2026 / 09:42 AM IST

వీధిలైట్లు లేక ఇబ్బందిపడుతున్న గ్రామస్తులు

MLG: మంగపేట (M) నర్సింహాసాగర్‌లో కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో బయటకు రావాలంటే పాములు, విషపురుగులు, దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నారు. పాములు రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లైట్లు మరమ్మతు చేసి సరిచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

March 9, 2026 / 09:38 AM IST

వీధిలైట్లు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

MLG: మంగపేట (M) నర్సింహాసాగర్‌లో కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో బయటకు రావాలంటే పాములు, విషపురుగులు, దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నారు. పాములు రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లైట్లకు మరమ్మతు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

March 9, 2026 / 09:38 AM IST

ట్రాక్టర్ బ్లేడ్‌తో కెనాల్ రోడ్డుకు మరమ్మత్తులు

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఉన్న కెనాల్ రోడ్డుకు మరమ్మతులు చేయిస్తున్నామని స్థానిక కౌన్సిలర్ రాజు తెలిపారు. సోమవారం పట్టణంలోని గ్రామ పంచాయతీ వెనకాల ఉన్న కెనాల్ రోడ్డును ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో మరమ్మతులు చేయించారు. కెనాల్ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.

March 9, 2026 / 09:36 AM IST

10 సెకన్ల యాడ్‌కు ఏకంగా రూ.50 లక్షలు

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నది. కాగా, బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు యాడ్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించవచ్చని కంపెనీలు భావించాయి.

March 9, 2026 / 09:35 AM IST

నిజాంసాగర్ నుంచి నాలుగో విడత నీరు విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నాలుగో విడతలో భాగంగా సోమవారం 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు పంట సాగుకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

March 9, 2026 / 09:33 AM IST

మనువాద సంస్కృతిని ప్రతిఘటించాలి: నేతలు

వనపర్తిలోని CITU కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవ సభలో CPM నేత పుట్ట ఆంజనేయులు, ఐద్వా కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. మహిళలు జీవితాంతం ఇతరులపై ఆధారపడి బతకాలనే మనువాద ధర్మాన్ని ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. లింగ సమానత్వం, సమాన హక్కుల సాధన కోసం మహిళలు పోరాడాలని వారు డిమాండ్ చేశారు.

March 9, 2026 / 09:33 AM IST

VIDEO: రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి

WGL: గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని వారు వ్యాఖ్యనించారు.

March 9, 2026 / 09:32 AM IST

వాంకిడి MPOకు తాత్కాలిక MPDOగా బాధ్యతలు

ASF: వాంకిడి MPDO పాటిల్ జ్యోత్స్న 45 రోజుల శాఖాపరమైన ప్రాథమిక శిక్షణకు వెళ్లారు. దీంతో ప్రస్తుత MPO జావీద్‌కు MPDOగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. శిక్షణలో జ్యోత్స్నకు విధులపై అవగాహన పెరుగుతుందని, తిరిగి మండలంలో తన పూర్తి MPDO బాధ్యతలను పునరుద్ధరించనుందన్నారు. అప్పటివరకు జావీద్ తాత్కాలికంగా MPDO బాధ్యతలు చేపడతారు.

March 9, 2026 / 09:31 AM IST

అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.

March 9, 2026 / 09:31 AM IST

పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా

KNR: పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ హుజురాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీపీఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

March 9, 2026 / 09:30 AM IST

భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 9 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకోవాడానికి నిందితులను విచారిస్తున్నారు.

March 9, 2026 / 09:28 AM IST