టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో సెమీఫైనల్‌లో కివీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. సీఫెర్ట్ (58), ఫిన్ అలెన్(100*) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో.. ఆదివారం జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ తలపడనుంది.
KRNL: ఎమ్మిగనూరులో BJP జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పద్మావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని BJP నాయకులు గురురాజ్ దేశాయ్, దయసాగర్, మాధవీలత, రామన్న గౌడ్, నారాయణ, SI మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పద్మావతిపై సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్త క్రింద “gouse3032” అనే వ్యక్తి ఆమెపై అసభ్యకరంగా రాసినట్లు పేర్కొన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌లో భాగంగా 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి GTS సెంటర్‌ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రతను సమీక్షించారు. హాజరు నమోదు పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.
NGKL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు.
TG: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నంద్యాల జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్. వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలు తమ వినికిడి సమస్యలను తల్లిదండ్రులకు వివరించలేరని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా సత్వర చికిత్స కేంద్రంలోని వైద్యాధికారులను సంప్రదించి పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించాలన్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. కేవలం 8.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (28 బంతుల్లో), ఫిన్ అలెన్ (19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 62 పరుగుల దూరంలో ఉంది.
నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఇయర్ వైజ్ బ్యాక్లాగ్ సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. 1st ఇయర్ మార్చ్ – 17 నుంచి ఏప్రిల్ – 4. 2nd ఇయర్ మార్చి-18 నుంచి ఏప్రిల్-6. 3rd ఇయర్ మార్చి -17 నుంచి ఏప్రిల్-9 మధ్య జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
AP: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ మరణించింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికాగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సూర్యకళ ప్రాణాలు వదిలింది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది.
AP: YCPలో పదవుల భర్తీలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పలు నియామకాలను చేపట్టారు. ఈ మేరకు YCP కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ CEC సభ్యునిగా పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), SEC సభ్యుడిగా వైసీ గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి(పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ(పార్లమెంటు), పోరెడ్డి నరసింహారెడ్డి(ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.
దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ ఆశావహులకు కీలక సమయం ఆసన్నమైంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 తుది ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27వ తేదీతో ఇంటర్వ్యూలు ప్రక్రియ పూర్తి కావడంతో, కమిషన్ ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
అన్నమయ్య: వైసీపీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ఛైర్మన్‌పై కులమతాల వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. హెరిటేజ్ అంశంపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం సభను పక్కదారి పట్టిస్తోందని అన్నారు. అచ్చెన్నాయుడిని సభ నుంచి సస్పెండ్ చేసి టీడీపీ నుంచి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
TG: కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. సుమారు గంట పాటు వీరి భేటీ జరిగింది. రాష్ట్ర పరిస్థితులు, మావోయిస్టు నేతల లొంగుబాటుపై వివరించారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కాగా, కేంద్రం తీసుకువచ్చిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే.
రేపు భారత్‌తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్నర్ల నుంచి తమ జట్టుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. నెంబర్ వన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు సవాలేనని, అతని బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం కష్టమని చెప్పాడు. స్పిన్నర్లను ఆడటంలో తమకు మంచి రికార్డు లేదని గుర్తు చేశాడు.
W.G: ఆచంట సబ్ రిజిస్ట్రార్‌గా బీ. జగన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలల నుంచి ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యాలయం నడుస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎవరికి ఎటువంటి మామూళ్లు ఇవ్వనవసరం లేదన్నారు.