BDK: రేపు జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని సూరారం తండా వెంకన్నపాలెం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవాలు చేస్తారని వారు తెలిపారు. అనంతరం జూలూరుపాడు మండల కేంద్రంలోని అధికారులతో కలిసి ప్రజాపాలన ప్రగతి-ప్రణాళిక సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
VSP: గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు సీఎస్‌ఆర్ నిధులతో చెరువులు, పార్కుల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారని ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు. ఆదివారం జీవీఎంసీ 69, 79 వార్డుల పరిధిలోని తుంగ్లం పెద్ద చెరువు, చాలేటి చెరువు, పాత అగనంపూడి చెరువులను పరిశీలించారు.
కృష్ణా: గన్నవరం MPDO కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలపై 17 అవగాహన స్టాళ్లు ఏర్పాటు చేశారు. మహిళా వ్యాపారవేత్తలు, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, P4 మహిళా మార్గదర్శులను సత్కరించారు.
VSP: కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో బావ, మరదళ్ల ప్రేమకథతో ఈ సినిమా రూపొందిందన్నారు. హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెంచరీ మిస్ చేసుకుంది. ఈ పోరులో ఇంగ్లండ్(2), సౌతాఫ్రికా(1), శ్రీలంక(1), పాకిస్తాన్(2), కెనడా(1), న్యూజిలాండ్(1) జట్ల నుంచి సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి అవుటై అభిమానులను నిరాశ పరిచాడు.
ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన చేసింది. ‘ఆత్మరక్షణగానే ప్రతిదాడులకు దిగాం. ఇరాన్ మా దేశంపై 1400కుపైగా.. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ అన్యాయంగా దాడి చేసింది. దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే’ అని పేర్కొంది.
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందని తెలిపారు.
MDCL: కూకట్‌పల్లి KPHBలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలో ఆరుగురు, KPHBలో 14 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ వ్యాప్తంగా అత్యధికంగా మియాపూర్‌లో 51 మందిపైన కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వారంలో మియాపూర్‌లో అత్యధికంగా మద్యం సేవిస్తూ పట్టుపడ్డారు.
AKP: రాంబిల్లి(మం) పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. జీడి, మామిడి తోటలను సాగు చేసుకుంటూ గత ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు తమ భూములను స్వాధీనం చేసుకుంటే ఎలా బతకాలని వారు ప్రశ్నించారు.
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ నాలుగో రోజు విచారణ ముగిసింది. గుంటూరు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని సీసీఎస్ పీఎస్‌లో సునీల్ నాయక్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. రేపు ఉ.10 గంటలకు సునీల్ మళ్లీ విచారణకు హాజరుకానున్నారు.
MLG: లోక్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త బాధ్యతల్లో వారు విజయవంతం కావాలని, దేశ ప్రగతికి మరిన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస(మం) పెదమేరంగి జంక్షన్‌లోని తిరుమల సాయి హైస్కూల్ 25వ వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లో బౌలింగ్ వేసిన బుమ్రా తొలి బంతికే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ అలెన్ వికెట్ పడగొట్టాడు. సెమీఫైనల్‌లోనూ తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన సంగతి తెలిసిందే.
KRNL: నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్‌కు శస్త్రచికిత్స జరగడంతో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం మార్కెట్ యార్డ్‌లో ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా డైరెక్టర్లు, మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా యార్డ్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు.