• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మట్టి కుండ నీళ్లతో ఇన్ని లాభాలా..?

ఎండాకాలంలో ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ అందడంతో పాటు శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

February 25, 2026 / 10:20 AM IST

చెత్త సేకరణకు 3 పుష్ కార్ట్స్

AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్‌తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

February 25, 2026 / 10:19 AM IST

మార్చి 14 నుంచి SSC పరీక్షలు: కలెక్టర్

ADB: పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలన్నారు.

February 25, 2026 / 10:16 AM IST

ట్యాంకు వద్ద మహిళ మృతి

PLD: రాజుపాలెం మండలం ఉప్పలపాడులో గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామంలోని నీటి ట్యాంకు సమీపంలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు వేల్పుల మల్లేశ్వరి (45)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

February 25, 2026 / 10:15 AM IST

ప్రత్తిపాడులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: ప్రత్తిపాడులో బకాయి పడ్డ జీతాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు ఇచ్చే వరకు పనిలోకి రావద్దని గతంలో చెప్పిన మేస్త్రి, ఇప్పుడు ట్రాక్టర్‌తో చెత్త ఎత్తించడంపై కార్మికులు మండిపడ్డారు. నిరసనగా చెత్త ట్రాక్టర్‌ను కదలకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.

February 25, 2026 / 10:14 AM IST

ప్రేమ పేరిట వేధింపులు.. కానిస్టేబుల్‌కు మరో ఆరేళ్ల జైలు శిక్ష

SRD: కానిస్టేబుల్ మందారిక హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కానిస్టేబుల్ జాల ప్రకాష్‌కు సంగారెడ్డి కోర్టు మరో ఆరేళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించింది. ప్రకాశ్ 2014లో SRD మహిళా ఠాణాలో పనిచేస్తూ కానిస్టేబుల్ మందారికను ప్రేమ పేరిట వేధించారు. తట్టుకోలేక ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మందారిక ఫిర్యాదు మేరకు కోర్టు మరో 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

February 25, 2026 / 10:12 AM IST

సహజ సంపదకు గండి.. 500 ట్రిప్పుల మట్టి మాయం!

KNR: వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట శివారులోని అక్రమ తవ్వకాలతో కర్షల్ గుట్ట కరిగిపోతోంది. ఓ రైస్మిల్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో 3 రోజులుగా మట్టి తరలించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 ట్రిప్పుల మట్టిని తరలించారని సమాచారం. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.

February 25, 2026 / 10:11 AM IST

‘త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి’

NZB: కమ్మర్ పల్లి మండలం వేసవి దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజిఎస్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

February 25, 2026 / 10:11 AM IST

కుళ్లిన ఆహారం.. జర భద్రం..!

NZB: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుళ్లి పోయిన చికెన్, మాంసంతో తయారు చేసిన ఫుడ్‌ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆకలేసి సుష్టుగా బిర్యానీ తిందామని ఏదైనా హోటల్‌కు వెళితే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే, నగరంలోని చిన్న, పెద్ద హోటల్స్ అనే తేడా లేకుండా కుళ్లిపోయిన బిర్యానీ వండి పెడుతున్నారు.

February 25, 2026 / 10:10 AM IST

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: చండూరులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు లైన్మెన్ షరీఫ్ పాషా తెలిపారు. శ్రీ మార్కండేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మునుగోడు రోడ్, మున్సిపల్ ఆఫీస్, కనకదుర్గమ్మ గుడి, ఆయిల్ మిల్ రోడ్ ప్రాంతాల్లో కోత ఉంటుందని వివరించారు. భక్తుల రక్షణ, రథోత్సవ నిర్వహణ దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 25, 2026 / 10:10 AM IST

11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు!

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్స్(ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదించింది. 11,127 ALPs ఖాళీలను భర్తీ చేస్తారు. ద.మ. రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. RRB త్వరలో ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి.

February 25, 2026 / 10:10 AM IST

7 వేల పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి సంధ్యారాణి

AP: అంగన్‌వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు. అదేవిధంగా 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 55,746 అంగన్‌వాడీ కేంద్రాలు, 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లలో హాజరు శాతం 70 నుంచి 96 శాతానికి చేరిందన్నారు.

February 25, 2026 / 10:09 AM IST

బాలికల పట్ల లైబ్రేరియన్ అసభ్య ప్రవర్తన.. HMకు ఫిర్యాదు

W.G: పాలకోడేరు (M) శృంగవృక్షం హైస్కూల్లో లైబ్రేరియన్ డేవిడ్ రాజు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. గ్రామ పెద్దలతో కలిసి తల్లిదండ్రులు HMకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద బుజ్జి రాజు మాట్లాడుతూ.. లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యే రఘురామకు తెలిపామన్నారు. అతను జిల్లా పరిషత్ ఎంప్లాయ్ అని అన్నారు.

February 25, 2026 / 10:06 AM IST

ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు

MDCL: హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధి తిరుమల నగర్‌లో ఉన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. 27వ తేదీన మైలపోలు కార్యక్రమం నిర్వహించనుండగా, 28వ తేదీన గంగపూజ, స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 10:05 AM IST

మే చివరి నాటికి ఘట్‌కేసర్ రైల్వే వంతెన పూర్తి

MDCL: ఘట్‌కేసర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ నివాసమూర్తి తెలిపారు. ప్రస్తుత పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, మే 2026 చివరి నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. వంతెన పూర్తయితే రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.

February 25, 2026 / 10:04 AM IST