• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’ చిత్రం’

VZM: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’ చిత్రనిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్ ఫిల్మ్ హౌస్ బ్యానర్ పై నిర్మాణం పూర్తిచేసుకున్న చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను ఆవిష్కరించారు.

March 5, 2026 / 05:53 PM IST

మహిళల అభివృద్ధి దేశానికి పునాది: కలెక్టర్

PLD: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా హక్కుల వారోత్సవాలు నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా , జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు మహిళా హక్కుల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

March 5, 2026 / 05:52 PM IST

పీఎం ఈజీపీ కార్యక్రమంపై అవగాహన

NRML: సారంగాపూర్ మండలంలోని చించోలి–బి గ్రామ మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, టీఎస్‌డబ్ల్యుసీడీసీ విజయలక్ష్మి పాల్గొని PMEGP,PMFME పథకాలపై వివరించారు.

March 5, 2026 / 05:52 PM IST

పీఎఫ్ క్లెయిమ్స్ ఇక సెకన్లలో..!

కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గొప్ప ఊరటనిచ్చే వార్త అందించింది. పీఎఫ్ ఉపసంహరణలో జాప్యాన్ని నివారిస్తూ కొత్తగా ‘ఆటో-సెటిల్మెంట్’ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై అధికారుల ప్రమేయం లేకుండా సాఫ్ట్‌వేర్ ద్వారానే దరఖాస్తులు వెరిఫై అయ్యి నగదు వేగంగా జమ అవుతుంది. ఇందుకోసం ఖాతాదారులు ఆధార్, బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి.

March 5, 2026 / 05:51 PM IST

మహిళలు బాలికల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ

AKP: ఆత్మ రక్షణ కోసం విద్యార్థులు కరాటే, కుంగ్ ఫూ నేర్చుకోవాలని పాయకరావుపేట సీఐ అప్పన్న సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు కరాటే, కుంగ్ ఫూలో శిక్షణ తరగతులు గురువారం నిర్వహించారు. ఆత్మ రక్షణ కోసం వీటిని నేర్చుకుంటే బాలికల్లో ఆత్మ స్థైర్యం వస్తుందన్నారు.

March 5, 2026 / 05:50 PM IST

అక్రమ లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించాలి: టీసీ వరుణ్

ATP: అనంతపురం అహుడా కార్యాలయంలో ఛైర్మన్ టీసీ వరుణ్, వైస్ ఛైర్ పర్సన్ విష్ణు చరణ్ గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఎంఐజీ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పింక్ టాయిలెట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 5, 2026 / 05:49 PM IST

పెద్దపల్లి మార్కెట్‌లో నేటి పత్తి ధరలు

PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. కనీస ధర రూ.5,302, గరిష్ట ధర రూ. 7,111, మోడల్ ధర రూ. 6,707గా నమోదైంది. మొత్తం 445 బ్యాగులు మార్కెట్ కు రాగా, 476.15 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. 173 మంది రైతులు తమ పత్తిని అమ్మకానికి మార్కెట్ కి తీసుకొచ్చారు. వ్యవసాయ మార్కెట్ లో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు సాగాయి.

March 5, 2026 / 05:49 PM IST

మహిళా సాధికారతపై వీడియో ప్రదర్శనలు

VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, హక్కులపై పోలీసులు ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి గురువారం అవగాహన కల్పించారు. మహిళల భద్రత, అత్యవసర సహాయ నంబర్లు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ఆధ్వర్యంలో కొనసాగాయి.

March 5, 2026 / 05:48 PM IST

‘అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్ర సంపద లూటీ’

VSP: అభివృద్ధి పేరుతో భూసేకరణలు పెంచి కార్పొరేట్ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షులు కెఎస్ చలం అన్నారు. గురువారం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశంలో అయన మాట్లాడారు. గిరిజన చట్టాలను కూడా పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటున్నారని అన్నారు.

March 5, 2026 / 05:48 PM IST

రామడుగులో మహిళా దారుణ హత్య

PDPL: రామడుగు మండల కేంద్రంలో ఈరెల్ల గౌరమ్మ (55) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. గౌరమ్మ భర్త కొమురయ్య, చిన్న కుమారుడు అనిల్ వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద కుమారుడు మహేశ్ ఇటీవల జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

March 5, 2026 / 05:48 PM IST

తొలిరోజు ముగిసిన సునీల్ నాయక్ విచారణ

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ తొలిరోజు విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మరో 3 రోజుల పాటు సునీల్ నాయక్ విచారణ కొనసాగనుంది.

March 5, 2026 / 05:47 PM IST

మధిర నుంచి పెనుగంచిప్రోలుకు ప్రత్యేక బస్సులు

KMM: శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా మార్చి 6 నుంచి 7 వరకు మధిర బస్టాండ్ నుంచి పెనుగంచిప్రోలు వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ మధిర డీఎం ఆర్.రామయ్య గురువారం తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధిర, పరిసర ప్రాంతాల భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

March 5, 2026 / 05:45 PM IST

ఈనెల 10న మెగా జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మార్చి 10న ఏఆర్ హెడ్ క్వాటర్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50కి పైగా కంపెనీలు పాల్గొని సుమారు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 7వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదివిన వారు అర్హులని, ఎంపికైన వారికి రూ. 13,000 నుంచి రూ.40,000 వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.

March 5, 2026 / 05:45 PM IST

ధవలేశ్వరం హెడ్ కానిస్టేబుల్‌కు ఏఎస్ఐగా పదోన్నతి

తూ.గో: ధవలేశ్వరం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.జయ రామరాజుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో ఉమ్మడి తూ.గో. జిల్లాలో కానిస్టేబుల్‌గా రిక్రూట్ అయిన ఆయన, గత 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. గత మూడేళ్లుగా ధవలేశ్వరంలో హెడ్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఆయనను పలువురు అభినందించారు.

March 5, 2026 / 05:44 PM IST

సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం

AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సామాజిక ప్రజావేదిక కార్యక్రమం గురువారం నిర్వహించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ అవి సక్రమంగా జరిగాయా అనే అంశంపై సామాజిక తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీ పూర్ణిమాదేవి, ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.

March 5, 2026 / 05:43 PM IST