GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే నా ప్రథమ ప్రాధాన్యత అని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం: పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
MDK: విశ్వకర్మలతో దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతరించిపోతున్న కళావృత్తులు, కళలను, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్‌ను స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుశీల పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పందిరి గీతకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
GNTR: కొల్లిపర మండలం సిరిపురం గ్రామానికి చెందిన గోసే రాజారావు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ సహాయం లభించింది. మంజూరైన నిధులకు సంబంధించిన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు నాదెండ్ల మనోహర్ అందజేశారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్లో శుక్రవారం అలుమ్ని మీట్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కార్పొరేట్ విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించారని అన్నారు.
ASF: వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గురునులే నారాయణ నూతన గృహాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజల సాకారాన్ని నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఉచితంగా ఇంటి నిర్మాణం చేస్తుందన్నారు.
NTR: విజయవాడ రూరల్ మండలం, జక్కంపూడి కాలనీ వాస్తవ్యులు శ్రీ అడపా లక్ష్మణరావు, వెంకటలక్ష్మి కుమార్తె, వివాహ రిసెప్షన్ వేడుకలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. నూతన వధూవరులు ధనలక్ష్మీ, రుష్యేంద్ర శ్రీనివాస్‌లకు అక్షింతలు వేసి ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
VKB: బషీరాబాద్ మండలం పలు గ్రామాలలోని రైతులు ఆశతో సాగు చేసిన కంది పంట చేతికొచ్చే సమయంలో పాడైపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టిన పంట కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పాడైపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
JN: జనగామలో బాల్య వివాహ విముక్తి రథాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు అంధకారమవటం, విద్య, ఆరోగ్యంపై గొడ్డలి పెట్టులా మారుతున్నాయని, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమాజం ముందుకు నడవాలని, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ అన్నారు.
కడప జిల్లా: వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది. పులివెందుల పీఎస్‌కు చేరుకున్న అధికారులు కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. మహేంద్ర యాదవ్ విచారణకు హాజరుకాగా, కిరణ్ యాదవ్ హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కిరణ్–అర్జున్ రెడ్డి కాల్ డేటాపై సీబీఐ ప్రశ్నిస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో క్లర్క్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్ 21న మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన వారి రోల్ నంబర్లతో ప్రొవిజినల్ జాబితాను SBI అధికారులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
కోనసీమ: జిల్లాలో మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10th పరీక్షలపై కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘100 రోజుల ప్రణాళిక’ ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను ‘షైనింగ్’, ‘రైజింగ్’ స్టార్లుగా విభజించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు కీలక సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, ఫోన్ వినియోగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు లోపం ఉన్నవారు రాత్రి వేళల్లో వాహనాలు నడపడం ముప్పుతో కూడుకున్నదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
MDCL: అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్, 190, 191 రాజ్ జేతేందర్ నాథ్ శుక్రవారం ఐఏఎస్ అధికారులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌లను కలిసి డివిజన్‌లలో వివిధ సమస్యలు, అర్బన్ బయోడైవర్సిటీ అభివృద్ధి అంశాలపై వినతిపత్రం అందజేశారు.