• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయస్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికైన యువకుడు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికయ్యాడు. ఇటీవల వేములవాడలో 4 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలకు పాల్గొని మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ యువకుడు కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

February 28, 2026 / 06:22 PM IST

మోదీ దిగ్భ్రాంతి.. మృతులకు ఎక్స్‌గ్రేషియా

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

February 28, 2026 / 06:22 PM IST

రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.

February 28, 2026 / 06:20 PM IST

‘విద్యా కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి’

SRCL: విద్యా కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి. డీటీయూ జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో ధర్మ టీచర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన విద్యా విధాన పత్రం 2026 పై రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య కోరుతున్నారన్నారు.

February 28, 2026 / 06:20 PM IST

‘తెర్నకల్‌లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ’

KRNL: దేవనకొండ(మం) తెర్నకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ ఆలూరు ఇంఛార్జి వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివ ప్రసాద్, జనసేన ఇంఛార్జి వెంకప్ప, గోవింద్ గౌడ్ పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించి వాల్మీకి బోధనలను స్మరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

February 28, 2026 / 06:19 PM IST

మెడికల్ కాలేజీలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సివిల్ జడ్జి యువరాజ్ విద్యార్థులకు చట్టాల ముఖ్యాంశాలు, రాజ్యాంగ హక్కులు, చట్ట అమలుపై వివరించారు. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు చట్ట పరిజ్ఞానాన్ని పెంపొందించి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం లక్ష్యమన్నారు.

February 28, 2026 / 06:18 PM IST

‘పరీక్షలు అంటే భయం విడనాడాలి’

W.G: విద్యార్థులు పరీక్షలు అంటే భయం విడనాడాలని సీబీఐ మాజీ జేడీ వీ.వీ.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం తణుకు రూట్స్ స్కూలు ఆధ్వర్యంలో సీఎం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కులు ప్రాతిపదికగా కాకుండా విద్యార్థులు భవిష్యత్తుపై గురి పెట్టాలని సూచించారు.

February 28, 2026 / 06:18 PM IST

MBNR:పాలమూరు అభివృద్ధికి కృషి చేయాలి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ ఎల్లప్పుడూ కృషి చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ నుంచి మేయర్‌గా మారడం ఎంతో సంతోషదాయకంగా ఉందని, పాలమూరు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయేలా అందరి సహకారం అందాలని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:12 PM IST

లోకేష్‌పై అంబటి ఆగ్రహం

AP: తనను 100 సార్లు జైలుకు పంపినా.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడనని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో విచారించిన ఎస్పీ, ఐజీ.. తన ఇంటిపై ఏడు గంటల పాటు దాడి జరిగితే ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:12 PM IST

ఈ ప్రాంతాల ప్రజలకు GOOD NEWS

HYD: కొకాపేట్, నియోపోలిస్ ప్రాంతంలో 3.95 ఎకరాల భూమిని ప్రభుత్వం జలమండలికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలో భారీ రిజర్వాయర్ నిర్మించి, కోకాపేట, నియో పోలీస్, ఓల్డ్ సిటీ, షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా మంచినీరు సరఫరా చేస్తారు. అంతేకాక.. బోజగుట్ట రిజర్వాయర్‌కు నీరు సరఫరా చేయనున్నారు.

February 28, 2026 / 06:11 PM IST

డా.బాబు రాజేంద్రప్రసాద్ సేవలు చిరస్మరణీయం

KNR: కథలాపూర్ మండలం సిరికొండ యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ 63వ వర్ధంతిని నిర్వహించారు. బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచనలో బాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్, నాంపల్లి శ్రీధర్, మహేష్, మధుసూదన్, సతీష్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:11 PM IST

‘సీసీ రోడ్డు, కమిటీ హాల్ మంజూరు చేయాలి’

ADB: నార్నూర్ మండలంలోని పలువురు సర్పంచులు శనివారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూరులోని పలు గ్రామాల్లో ఉన్న రహదారులు అధ్వానంగా మారాయన్నారు. దీంతో నూతన సీసీ రోడ్డు, కమిటీ హాల్, నీటి బోర్ వేల్స్ మంజూరు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం పరమేశ్వర్, మహాదు, రాహుల్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:10 PM IST

యుద్ధం సెగ.. భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కరోజే తులం బంగారంపై రూ.4,000 పెరిగి రూ.1,68,710 (24K)కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650గా ఉంది. వెండి కిలోకు రూ.25,000 పెరిగి రూ.3,20,000 మార్కును తాకింది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు వీటిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.

February 28, 2026 / 06:10 PM IST

రేషన్ కార్డుదారులకు అలర్ట్

ATP: జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు మార్చి నెల నిత్యావసర సరుకులను సిద్ధం చేసినట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం, జొన్నలు, రాగులు ఉచితంగా అందజేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో గోధుమపిండి పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:07 PM IST

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

TPT: తిరుపతిలో కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతీయ సమీక్ష నిర్వహించారు. రైతులకు MSP చెల్లింపులు సమయానికి జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ సోరబ్ గౌర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:06 PM IST