• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అప్పటి GHMC యాప్.. ఇప్పుడు My CURE

HYD: అప్పటి GHMC యాప్, ఇప్పుడు My CURE యాప్ అయింది. ఈ యాప్ జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సేవలు అందించడానికి ఉపయోగించేలా రూపొందించారు. My CURE అంటే మై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఈ పేరు పెట్టారు. మూడు కార్పొరేషన్ల ప్రజలు ఈ యాప్ యూజ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 26, 2026 / 07:45 PM IST

‘శతశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి’

AKP: పంచాయితీ సిబ్బంది శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని నర్సీపట్నం డీఎల్డీవో నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం పాయకరావుపేట పట్టణంలో సిబ్బంది అధికారులతో కలిసి పలు షాపుల వద్దకు వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో వివిధ పన్నుల రూపంలో రూ.17 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 58% వసూళ్లు చేశామన్నారు.

February 26, 2026 / 07:45 PM IST

ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్

మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు..

February 26, 2026 / 07:44 PM IST

ప్రైవసీ డిస్‌ప్లేతో శాంసంగ్ S26 అల్ట్రా.. ధర ఎంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ S26 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ S26 అల్ట్రాతో పాటు S26, S26+ మోడళ్లను తీసుకొచ్చింది. గెలాక్సీ S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్5, 5000mAH బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. S26 అల్ట్రా (12GB+256GB వేరియంట్) ప్రారంభ ధర రూ.1,39,999, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,59,999, 16GB+1TB వేరియంట్ ధర రూ.1,89,999గా నిర్ణయించారు.

February 26, 2026 / 07:43 PM IST

‘ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి’

నంద్యాల జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ జీ. రాజకుమారి వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

February 26, 2026 / 07:43 PM IST

బాధితుడి చెంతకే పోలీస్.. ఆసుపత్రిలో కేసు నమోదు..!

సూర్యాపేట: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని సూర్యాపేట పోలీసులు నిరూపించారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడెల్లి రంగా వద్దకు ఎస్సై మహేంద్రనాథ్ స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు లింగయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్న బాధితులకు తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

రేపు దమ్మపేటలో ఎమ్మెల్యే పర్యటన

BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి వట్టి వెంకట్రావు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ హెచ్ జి భవన శంకుస్థాపన, జిపిఎస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన, అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం, సిసి రోడ్డు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ స్టేట్ టెలిస్టులేటివ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు హాజరై క్రీడలు ఆడుతున్న ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహించాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆలోచన రాబోయే కాలంలో లెజిస్లేటివ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పునాది కావాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:42 PM IST

కలెక్టర్‌ను కలిసిన కేఎంసీ కమిషనర్

KDP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సీ.)గా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ చంద్రం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, పౌర సేవలపై పరస్పరం చర్చించినట్లు తెలిసింది.

February 26, 2026 / 07:42 PM IST

బ్రహ్మోత్సవాల్లో రేపటి విశేష పూజలు

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:00 గంటలకు పుష్పయాగము, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, ధోపోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

February 26, 2026 / 07:41 PM IST

గుంజేడు ముసలమ్మ జాతరలో భక్తుల కోసం ఏర్పాట్లు

MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో భక్తుల కోసం 5 వసతి గృహలు, కాటేజీలు, 10 షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసారు. వీటిని మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేశామని, సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు.

February 26, 2026 / 07:40 PM IST

విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

WNP: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్వేతాచల శ్రీనివాస స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:40 PM IST

‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’

NZB: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని బిక్కనూర్ ఎంఈవో రాజగంగారెడ్డి ఆదేశించారు. గురువారం బస్వాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.

February 26, 2026 / 07:39 PM IST

నేతి విద్యాసాగర్ ను కలిసిన నేతలు

NLG: చిట్యాల 1వ వార్డుకు చెందిన మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ ఎడ్ల పద్మ, కాంగ్రెస్ నాయకుడు మహలింగం యాదవ్ దంపతులు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని, దీనిపై విద్యాసాగర్ సానుకూలంగా స్పందిస్తూ.. నేను ఉన్నాను, అంటూ ధైర్యం చెప్పారని వారు పేర్కొన్నారు.

February 26, 2026 / 07:39 PM IST

మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

W.G: మండల కేంద్రం అయిన ఉండి హైస్కూల్లో క్లినికల్ సైకాలిజిస్ట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురికాకుండ చూసుకోవాలని కోరారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. 11416 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. సునంద, కృష్ణ కుమార్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:37 PM IST