• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవుల సూర్యచంద్రరావు, కోశాధికారిగా కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, సలహాదారుడిగా పళ్ళ వెంకటగిరిను ఎన్నుకున్నారు.

February 21, 2026 / 11:20 AM IST

చోరీలపై ఎస్సైహెచ్చరిక

KRNL: మద్దికేర మండల ప్రజలకు శనివారం ఎస్సై హరిత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. జిల్లా పరిసరాల్లో ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చైన్ దొంగతనం జరిగినట్లు పేర్కొని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేయాలని సూచించారు.

February 21, 2026 / 11:19 AM IST

రేపు ఉచిత వైద్య శిబిరం

అన్నమయ్య: రాజంపేట మండల పరిధి బోయినపల్లిలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2026 / 11:19 AM IST

ఎంపీని కలిసిన నారాయణపేట నూతన పాలకవర్గం

MBNR: నారాయణపేటలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రతినిధులు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరుణ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 11:19 AM IST

‘మోడల్ సోలార్ విలేజ్’పై అవగాహన

VKB: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ పథకం గురించి అవగాహ సదస్సు నిర్వహిస్తున్నట్లు KADA స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్, TGSPDCL, CMD ముషరాఫ్, TGREDCO, MD అనీలా పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 11:18 AM IST

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఇంటర్ ప్రశ్నాపత్రాలు

SRPT: తుంగతుర్తిలోని పోలీస్‌ స్టేషన్‌కు ఇంటర్‌ ప్రశ్నా పత్రాలు శనివారం చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ అరుణలు పేర్కొన్నారు. ప్రశ్న పత్రాలను స్టేషన్‌లో ప్రాంగణంలో సరిచూసుకుని ప్రత్యేక పెట్టెల్లో భద్రపరచారు.

February 21, 2026 / 11:17 AM IST

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే

TPT: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్‌కు పలు ప్రాంతాల ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆర్జీలను అధికారులకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

February 21, 2026 / 11:17 AM IST

సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన

VZM: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. కొండవెలగాడ-విజయనగరం రహదారి రిసర్ఫేసింగ్ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంతోనే పారదర్శక పాలన సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గదల అచ్చంనాయుడు, యడ్ల గోవిందరావు పాల్గొన్నారు.

February 21, 2026 / 11:17 AM IST

ట్రైన్ కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

MHBD: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని, చీరాల నుంచి సికింద్రాబాద్ టికెట్ మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి గురించి ఏవైనా సమాచారం ఉన్నవారు 8712658602 నెంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయవలసిందిగా సూచించారు.

February 21, 2026 / 11:16 AM IST

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

SKLM: పవిత్ర ఖురాన్ అవతరించిన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అనేది ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:15 AM IST

శ్రీవారిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే

ATP: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాక్షస ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వరుని వేడుకున్నానని తెలిపారు.

February 21, 2026 / 11:14 AM IST

పేద విద్యార్థికి ఎమ్మెల్యే చేయూత

MBNR: దేవరకద్ర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఉస్కిల లక్ష్మమ్మ కుమారుడు వంశీ మెడిసిన్‌లో సీటు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ సందర్భంగా అతని ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటుగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివడం సంతోషమన్నారు.

February 21, 2026 / 11:13 AM IST

శ్రీవారి ఫోటోలతో ప్లకార్డులు.. MLA ఫైర్

W.G: శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానించారని మండిపడ్డారు.

February 21, 2026 / 11:13 AM IST

ఘనంగా మల్లికార్జున స్వామి ఉత్సవం..!

NGKL: బిజినేపల్లి మండలం మంగనూరులో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బండ్లు, బోనాల సమర్పణ చేయనున్నారు. గ్రామం నుంచి బయలుదేరే ఈ బండ్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

February 21, 2026 / 11:12 AM IST

రోడ్డును కమ్ముకున్న కంపచెట్లు .. పొంచి ఉన్న ప్రమాదం..!

SRPT: కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు రహదారి పక్కకు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే అధికారులు చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

February 21, 2026 / 11:12 AM IST