• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: MAO

SRCL: రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన, దిశ నిర్దేశం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దుర్గరాజు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో రసాయనాలను తగ్గించాలన్నారు.

February 20, 2026 / 08:02 PM IST

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం చేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

February 20, 2026 / 08:02 PM IST

యాదాద్రి దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.20,47,905 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.6,55,700, లీజులతో రూ.5,35,400, కార్ పార్కింగ్‌తో రూ.2,27,000, VIP దర్శనాలతో రూ.1,50,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,02,900, వ్రతాలతో రూ.1,01,000, కళ్యాణకట్ట రూ.49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.

February 20, 2026 / 08:02 PM IST

బొప్పాయి సాగువైపు రైతుల మొగ్గు

ప్రకాశం: మర్రిపూడి మండలంలో రైతులు ప్రధానంగా పొగాకు, కంది సాగుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నీటి వనరులు ఉన్న రైతులు బొప్పాయి పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. మండలంలో దాదాపు 500 ఎకరాలకుపైన బొప్పాయి పంట సాగులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. నీటి వనరులు ఉంటే బొప్పాయి పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు తెలిపారు.

February 20, 2026 / 08:02 PM IST

కవి రాజుకు ప్రతిభా పురస్కారం

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం చెందిన ఆర్మీ అధికారి, జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సాహితీ ప్రతిభా పురస్కారం 2026ను హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో శుక్రవారం అందుకున్నారు. ఆయన చేస్తున్న అవిరళ విశిష్ట సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు.

February 20, 2026 / 08:02 PM IST

రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపిక

NZB: కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ది వరుణ్, అక్షర రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కనక గంగాధర్ తెలిపారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడా పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు.

February 20, 2026 / 08:01 PM IST

‘సమత డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా’

MHBD: పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి పాస్, ఫెయిల్ అయిన యువతీ, యువకుల కోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు తొర్రూరు మండల కేంద్రంలోని సమత డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కోఆర్డినేటర్ స్రవంతి తెలిపారు. ఆసక్తి గలవారు 9063484855 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

February 20, 2026 / 08:01 PM IST

పెద్దిరెడ్డిపల్లి ఫీడర్‌లో విద్యుత్ అంతరాయం

సత్యసాయి: పరిగి మండలం 11కేవీ పెద్దిరెడ్డిపల్లి ఫీడర్‌లో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు 11కేవీ లైన్ క్రింద మంటలు పెట్టడంతో ఈ అంతరాయం ఏర్పడినట్లు పరిగి ఏఈ సంజీవప్ప తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. త్వరలో విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ తెలిపారు.

February 20, 2026 / 08:00 PM IST

‘లడ్డు విషయంలో పొరపాటును సరిదిద్దుకోవాలి’

NLR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు.

February 20, 2026 / 08:00 PM IST

‘ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు కృషిచేయాలి’

కోనసీమ: ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు విశేషంగా కృషి చేయాలని కొత్తపేట జనసేన ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రావులపాలెం మండలం లక్ష్మిపోలవరం గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

February 20, 2026 / 08:00 PM IST

కొంతమూరులో నడిరోడ్డుపై మూగజీవుల సంచారం

E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరులో నడి రోడ్డుపై మూగజీవులు సంచారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆవులు ప్రమాదకరంగా నడిరోడ్డుపై తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్, కోరుకొండ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగగా ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఈనెల 21న రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు

ATP: గార్లదిన్నె మండలంలో సింగరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరుగుతాయని గ్రామస్తుల శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈనెల 21న న్యూ కేటగిరి విభాగానికి పోటీలు ఉండగా, 22న సీనియర్ కేటగిరి విభాగానికి పోటీలు జరుగుతాయన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఈనెల 23న మెగా జాబ్ మేళా

KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈనెల 23న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు.10th ఆపై చదివిన, 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.

February 20, 2026 / 08:00 PM IST

పరీక్ష ఫీజుల నోటిఫికేషన్ విడుదల

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి నిజామాబాద్ అనుబంధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఆదిలాబాద్‌లో ఈనెల 24న జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 08:00 PM IST