• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏకసభ్య కమిషన్‌ను తప్పుపట్టిన భూమన

AP: ఏకసభ్య కమిషన్ నియామకాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడనేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కోరుకున్నట్లు సీబీఐ విచారణ జరగలేదని.. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమేనని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:32 PM IST

నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

CTR: తిరుపతి నుంచి రంగంపేట, భీమవరం, కొత్తపేట, పులిచెర్ల మీదుగా కల్లూరుకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు RTC అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం 12:45కు కల్లూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి వెళుతుందన్నారు.

February 20, 2026 / 06:31 PM IST

5 రోజుల్లోనే రైతులకు డబ్బులు జమ: జేసీ

నెల్లూరు జిల్లాలో శెనగ పంటను క్వింటాలకు రూ. 5875 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామన్నారు. విక్రయించిన ఐదు రోజుల్లోనే నగదు జమ అవుతుందన్నారు.

February 20, 2026 / 06:30 PM IST

దేవస్థాన పనులకు కొటేషన్లు ఆహ్వానం

KNR: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. పందిళ్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ టీవీలు, అన్నదాన సామగ్రి, పెయింటింగ్ వంటి పనులకు ఆసక్తి గలవారు రూ.500 చెల్లించి, ఈ నెల 24న ఉదయం 11 గంటలలోపు కొటేషన్లు సమర్పించాలని వెల్లడించారు.

February 20, 2026 / 06:30 PM IST

ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగులూరు ప్రభుత్వ పాఠశాలలో ఫోక్స్ చట్టంపై SI సత్యనారాయణ శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల తమపై జరిగే వేధింపుల పట్ల మౌనంగా ఉండకూడదని తెలిపారు. ఫోక్స్ చట్టం ద్వారా లభించే రక్షణ గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:30 PM IST

‘స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సంస్కృతికి ప్రతీకగా నిలవాలి’

GNTR: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలో నిర్మించబోయే సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు.

February 20, 2026 / 06:30 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

NLG: మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంకు చెందిన రేషన్ డీలర్ ఉడుత సైదులు సోదరుని వివాహ వేడుక ఇవాళ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

February 20, 2026 / 06:30 PM IST

జాగ్రత్త: అతిగా ఉప్పు వాడుతున్నారా..?

మనం ఆహారంలో రుచి కోసం వాడే ఉప్పును పరిమితం చేయాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు రావడం, ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. ప్యాక్ చేసిన చిప్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉప్పు మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి, వాటికి దూరంగా ఉండాలి.

February 20, 2026 / 06:30 PM IST

‘విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

ELR: నూజివీడు పట్టణంలో శుక్రవారం మెటాస్ విద్యాసంస్థలో న్యాయ దినోత్సవం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ పెద కాసిం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యాహక్కు చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం, మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన పెంపొందాలన్నారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎస్ కే డి ప్రసాద్ పాల్గొన్నారు.

February 20, 2026 / 06:29 PM IST

ఐఈడీ పేలుడు.. జవానుకు తీవ్రగాయాలు

TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రెగుట్టల్లో పేలుడు జరిగింది. హెలికాప్టర్‌లో జవానును పోలీసులు వెంకటాపురం తరలించారు. వెంకటాపురం నుంచి వరంగల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 20, 2026 / 06:27 PM IST

‘సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలి’

AKP: ఈనెల 22న విశాఖలో జరిగే సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలని పీఆర్డీయూ జిల్లా అధ్యక్షులు డీ. గోపినాధ్ తెలిపారు. శుక్రవారం ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు ఏపీసీపీఎస్ఈఏ ఈ సాగర సంగ్రామ దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. ఈ దీక్షలో పీఆర్డీయూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 06:27 PM IST

వైద్య సేవలపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సమీక్ష

KMR: ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానలు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం అమలుపై జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నర్సింగ్ శుక్రవారం సమీక్షించారు. బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.

February 20, 2026 / 06:27 PM IST

యువతిపై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్

SRPT: చివ్వెంల మండలం కూడకుడకు చెందిన పట్టేటి స్పందనపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడు బోయిండ్ల మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్స మహేశ్వర్ గురువారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడిని విచారించి రిమాండ్‌కు తరలించారు.

February 20, 2026 / 06:26 PM IST

విద్యుత్ షాక్‌తో గిరిజన మహిళా రైతు మృతి

మహబూబాబాద్ మండలం సండ్రాలగూడెం శివారు పూరి తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోత్ లక్ష్మి (55) అనే గిరిజన మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:25 PM IST

అమ్మవారి నిత్యా అన్నదానానికి భారీ విరాళం

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నిత్య అన్నదాన పథకం కోసం గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ వాస్తవ్యులు శ్రీ ముప్పవరపు రమేష్ కుమార్, శ్రీమతి మాధవి లత దంపతులు విరాళం అందజేశారు. ఈ మేరకు వారు తమ కుమారుడు UASలో నివసిస్తున్న శ్రీ మెగా హర్ష ముప్పవరపు పేరిట రూ.5,01,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలను అభినందించారు.

February 20, 2026 / 06:24 PM IST