GNTR: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి పలు అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిసరాల శుభ్రత, భద్రత, రికార్డుల సమగ్రమైన నిర్వహణ, ప్రజల కోసం సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం వంటి విషయాలపై సూచనలు ఇచ్చారు. అలాగే విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీలు నిర్వహించాలని తెలిపారు.
KNR: సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ వర్మకు మంజూరైన రూ. 60 వేల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్ ఆదివారం అందజేశారు. సీఎంఆర్ఎఫ్ కష్ట సమయాల్లో ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానుగంటి భిక్షపతి, డాక్టర్ శ్రీనివాస్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
BHPL: జిల్లా చిట్యాల మండలంలోని భావుసింగ్ పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామారావు గ్రూప్-2 కొలువుకు ఎంపికయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)గా ఎంపికైనట్లు రామారావు చెప్పారు. 6 సంవత్సరాలు 18 గంటల చొప్పున చదువుతూ సివిల్స్ ప్రిపేర్ ఆయన అయినట్లు తెలిపారు.
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బతుకమ్మ ఆటలు అధికారులు అంతా నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దంపతులు, అదనపు కలెక్టర్ దంపతులు, మున్సిపల్ కమిషనర్ దంపతులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
NZB: ఆలూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన నిఖితరెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో ర్యాంక్ సాధించి డీస్పీగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. సామాన్య రైతు కుటంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదివి డీస్పీగా ఉద్యోగం రావడంతో గ్రామస్థులు ఆమెను అభినందించారు.
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ ఇంద్రానగర్‌కు చెందిన మిద్దె రవి కూతురు మిద్దె పల్లవి ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో చదువుతున్నారు. పల్లవి మెడికోకు విద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదివారం రూ. లక్ష ఆర్థిక సహాయం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందించారు. పల్లవి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ATP: శరన్నవరాత్రుల సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
VSP: విశాఖ కలెక్టరేట్లో 29వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
PDPL: శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో చక్రీ భజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిరంతరం భజన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయం యొక్క ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. చక్రిభజన కార్యక్రమములో అన్ని వాడలకు చెందిన భజన పరులు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న NTR భరోసా పథకంలో భాగంగా అక్టోబర్ నెలకు గాను జిల్లాలో 2,56,817 మందికి పింఛన్లు మంజూరు చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి రూ. 111,44 కోట్లు కేటాయించారు. గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఆయా బ్యాంకులకు సోమవారం వెళ్లి నగదును సిబ్బందికి అందజేయాలని ఏపీ సెర్ఫ్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు అందాయి.
SRCL: బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ముస్తాబాద్ ఎస్సై గణేష్ సూచించారు. బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు విలువైన ఆభరణాలు ధరించి వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, యువకులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని అన్నారు.
కడప రిమ్స్ ఠాణా పరిధిలో గొలుసు దుకాణంపై దాడి చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పట్టణంలోని సరోజినీ నగర్లో కొండయ్య అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 24 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: టెక్కలి ఎస్సై రాము ఆధ్వర్యంలో భగవాన్ పురం గ్రామంలో సంకల్పం అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు పంపే సందేశాలకు స్పందించవద్దని సూచించారు. ఏటీఎం, బ్యాంకులలో అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో నేరాలకు దూరంగా జీవించాలని, మత్తు పదార్థాలు, గంజాయికు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.
JGL: రాయికల్ గ్రామానికి చెందిన ఆర్మూరి శివకుమార్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 2 ఫలితాల్లో విజయం సాధించారు. ఆయన రాష్ట్ర సచివాలయం, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని General Administration Department(GAD)లో సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. గ్రామస్తులు శివ కుమార్‌ను అభినందించారు.