• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుంది: ఎమ్మెల్యే

కోనసీమ: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆరోపించారు. శాసనమండలిలో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు అపచారంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.

February 21, 2026 / 01:17 PM IST

ఈనెల 25న మరుపల్లి ఎల్లమ్మ జాతర

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఈనెల 25వ తేదీన ఎల్లమ్మ జాతర జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఎల్లమ్మ పూజారి రుద్రాక్షల సత్యం, పరశురామున్న పూజారి కర్ణకోట కసవయ్యలు సిరిమాను అధిరోహిస్తారని చెప్పారు. 24న తోలేల ఉత్సవం, 26న కనుము జరుపుతారని తెలిపారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి అనంతరం జరుగుతుందన్నారు.

February 21, 2026 / 01:16 PM IST

మాతృభాషా దినోత్సవానికి హైస్కూల్ వేదిక

PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తోట శంకరరావు మాట్లాడుతూ.. భాషల వైవిధ్యాన్ని కాపాడటం, మాతృభాషపై గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

February 21, 2026 / 01:16 PM IST

కోరుట్ల రహదారికి మహర్దశ: ఆది శ్రీనివాస్

SRCL: వేములవాడ నుంచి కోరుట్ల పట్టణం సమీపంలోని యకీన్ పూర్ వరకు 100 ఫీట్లతో 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరైనట్లు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే వేములవాడ – కోరుట్ల రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించగా.. వేములవాడ నుంచి యకీన్ పూర్ వరకు రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు మంజూరు అయ్యాయని విప్ తెలిపారు.

February 21, 2026 / 01:15 PM IST

విద్యుత్ సమస్యలకు ఇక చెక్: ఎమ్మెల్యే బత్తుల

E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ అధికారులతో MLA సమావేశమై మాట్లాడారు. గ్రామాల వారీగా కొత్తగా విద్యుత్ పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు తదితర విద్యుత్ సమస్యల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.

February 21, 2026 / 01:15 PM IST

ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలి: MLA

VZM: బొబ్బిలి MLA బేబినాయన శనివారం స్దానిక MPDO కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎర్పాటు చేసిన స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం ఈ రథం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 01:13 PM IST

‘అవసరానికి మించి యూరియా వినియోగం వద్దు’

KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:13 PM IST

పసిబిడ్డ ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే మద్దిపాటి

E.G: గోపాలపురం నియోజకవర్గంCH పోతేపల్లికి చెందిన యర్రంశెట్టి యేసు – ఝాన్సీ రాణి దంపతులకు పుట్టిన 10 రోజుల పసిబిడ్డ ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక ప్రాణాపాయ స్థితిలో ఉంది. చాలాఖర్చవుతుందని వైద్యులుతెలపడంతో ఆ కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్నిఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా శనివారం రూ.3,02,729 ఎల్ఓసీ మంజూరు చేయించారు.

February 21, 2026 / 01:12 PM IST

అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రఘు వంశీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

February 21, 2026 / 01:12 PM IST

డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం

SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:12 PM IST

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే

NGKL: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 01:11 PM IST

సామ్రాజ్యవాద ధోరణులతో ముప్పు: సీపీఎం

NLG: అమెరికా సామ్రాజ్యవాద ధోరణులు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్టడీ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని ఆయన విశ్లేషించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.

February 21, 2026 / 01:10 PM IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

RR: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పనులు చేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎండాకాలం ముగిసే సరికి రోడ్ కల్వర్టు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరారు.

February 21, 2026 / 01:10 PM IST

ఘనంగా అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవ వేడుకలు

W.G: భీమవరం సివి రామన్ స్కూల్లో శనివారం శ్రీవిజ్ఞాన వేదిక చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి., గోపాలశర్మ, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. భాషా వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసమే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నాగేశ్వరరావు,శర్మ, రాజబాబు,బాషా, పాల్గొన్నారు.

February 21, 2026 / 01:09 PM IST

ఈనెల 23న రైతు సంఘర్షణ సభ

GDWL: ఈనెల 23న గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సమస్యల పరిష్కారానికై నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తునట్లు అట్టి సభను విజయవంతం చేయాలని గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు విలేకరులు సమావేశం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండాగా రైతులను మోసం చేస్తుందని అన్నారు.

February 21, 2026 / 01:08 PM IST