NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడడంతో శనివారం కాలనీవాసులు గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్‌కు సమస్య పరిష్కారానికై వినతి పత్రాన్ని అందించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. అతి తొందర్లోనే కాలనీలో తాగునీటి సమస్యను తీర్చేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
JGL: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలలోని కౌన్సిలింగ్ కేంద్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్ల వృద్ధుల ఫిర్యాదులపై కొడుకులను పిలిపించి విచారణ చేశారు. తల్లిదండ్రులను పోషించకపోతే 6 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని టోల్ గేట్ వద్ద టోల్ గేట్ కార్మికులు తమ వేతనాలు చెల్లించాలని శనివారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాడి గ్రామానికి చెందిన కళ్యాణ్ సంతోశ్ (44) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకునే ఆయన కొంతకాలంగా మద్యానికి బానిసయ్యారు. మద్యం మత్తులో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు SI సుప్రియ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు గడువును మార్చి15 వరకు పొడిగించాలని రైతులు, నేతలు డిమాండ్ చేశారు. CCI కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తమైంది. వర్షాలు, కూలీల కొరతతో కోతలు ఆలస్యమయ్యాయని, మాజీ MLA కోనేరు కోనప్ప ఆదేశాలతో BRS నేతలు MRO మధుకర్‌కి శనివారం వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు విక్రయించే అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు.
భారత్‌తో T20 WC మ్యాచ్ సమయంలో శ్రీలంక పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని పాక్ స్పిన్నర్ ఉస్మార్ తారిక్ ఆరోపించాడు. మ్యాచ్ వేళ టీమిండియా ప్లేయర్ల బ్యాగులను పోలీసులు కనీసం పట్టుకోలేదు కానీ తమతోపాటు టీమ్ స్టాఫ్ బ్యాగులను ఒకటికి 2 సార్లు చెక్ చేశారని అసహనం వ్యక్తంచేశాడు. తమపై ఇంతటి వివక్ష ఎందుకంటూ సీరియస్ అయ్యాడు. అతని ఆరోపణల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
SKLM: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 5న విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. ధనలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆశాలకు కనీస వేతనం పెంచాలన్నారు.
NDL: ప్యాపిలి మండల పరిష్యత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ‘తుక్కు ఇవ్వండి సరకులు తీసుకోండి’ అనే నినాదంతో ఈ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ సేకరిస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకుల గురించి వివరించారు.
MDK: నార్సింగి కస్తూర్బాలో ఖాళీ ఉన్న అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రత్యేక అధికారి మమత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలిని, అప్లై చేసే అభ్యర్థి అసిస్టెంట్ కుక్‌కు 10వ, స్కావెంజర్ 7వ తరగతి పాసై ఉండాలన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వందల ఏళ్ల తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరగగా, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గర్భాలయంలో పూజలు చేశారు. నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి, గోపురాలపై కలశస్థాపన నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమనికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
PLD: పిడుగురాళ్లలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వయంగా రోడ్లను శుభ్రం చేసిన ఆయన, పరిసరాలు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.
SRPT: సమస్యలు చెప్పండి పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్త సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
KRNL: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పెద్దకడబూరు టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు హాజరయ్యారు. పెద్దకడబూరు మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.
BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ. 50,95,248 విలువైన చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.