• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ బొంతు సుమలత, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, బండారు శరత్ చంద్ర శనివారం TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గెలుపుకు కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

February 21, 2026 / 02:08 PM IST

పథకాలు అమలులో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే బత్తుల

E.G: విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. DRDA – సెర్ప్ శాఖ అమలు చేస్తున్న పథకాలు అమలుపై శనివారం రాజానగరంలో ఆయన సమీక్షి నిర్వహించారు. ఫీల్డ్ సిబ్బంది పై తరచూ పిర్యాదులు వస్తున్నాయని అలా రాకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు.

February 21, 2026 / 02:08 PM IST

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు

JGL: సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు ఆయనను సన్మానించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

February 21, 2026 / 02:07 PM IST

పది ఫలితాల్లో ఉత్తమంగా రాణించాలి: కలెక్టర్

ADB: పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 02:05 PM IST

‘వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలి’

ELR: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అన్నారు. శనివారం ఉంగుటూరు టోల్గేట్ వద్ద చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించినవారికి జరిమానాలను విధించకుండా, వాహన దారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:05 PM IST

స్వయంగా చెత్తను ఊడ్చిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు మండలం దుంపగడపలో శనివారం ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ నాగరాణి పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా రహదారిని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అనంతరం వర్మీ కంపోస్ట్ ఎరువు విక్రయాలను ప్రారంభించారు.

February 21, 2026 / 02:03 PM IST

శిథిలావస్థలో ఐసీడీఎస్ కార్యాలయం.. ప్రాణభయంతో సిబ్బంది

ASR: రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంపైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో నెలవారీ సమావేశాల నిర్వహణ వారికి ప్రాణసంకటంగా మారింది. ఏదైనా పెను ప్రమాదం జరక్కముందే ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయానికి వెంటనే నూతన భవనాన్ని కేటాయించాలని సిబ్బంది కోరుతున్నారు.

February 21, 2026 / 02:03 PM IST

జనార్దన్‌కు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్కూటర్ అందజేత

రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సిపి సీనియర్ కార్యకర్త జనార్దన్‌కు రూ.లక్షకు పైగా విలువ చేసే ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన జనార్దన్‌కు నేతలు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకలు పాల్గున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: ఫిరంగిపురం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములూరిపాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

‘ప్రతి యువకుడు రక్తదానానికి ముందుకు రావాలి’

SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

అంబేడ్కర్ సర్కిల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:01 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: ఏఆర్ అదనపు ఎస్పీ

KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

ఎల్లారమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్‌.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 02:00 PM IST

ఒకరోజు ముందుగానే శ్రీవిష్ణు సందడి

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. FEB 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక నయన్ సారిక కథానాయికగా నటించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.

February 21, 2026 / 01:58 PM IST

రవితేజ ‘BMW OTT రిలీజ్.. ఆలస్యానికి కారణమిదే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా OTTలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని సమాచారం. OTT సంస్థ జీ5 ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తుందట.

February 21, 2026 / 01:56 PM IST