• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైద్య ఖర్చుల కోసం LOC పత్రం అందజేత

E.G: కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామానికి చెందిన ఆకుల రాజకుమారికి వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.

February 21, 2026 / 04:20 PM IST

కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట పంచాయతీలోని శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ దేవతల మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 21, 2026 / 04:20 PM IST

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

ATP: అనంతపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 143 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరైన బాష @ కురుబ రామాంజినేయులు పాత నేరస్థుడని, అతనిపై 15 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 04:20 PM IST

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: డీఈవో

SRD: జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 -9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

February 21, 2026 / 04:19 PM IST

లక్ష ఎకరాలకు నీరందిస్తాం: మంత్రి

TG: సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఆందోల్ నియోజకవర్గానికి మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పోసానిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్డీ డిస్టలరీని మంత్రి ప్రారంభించారు. ఈ సంస్థను విస్తరించి 500 మందికి ఉపాధి కల్పించేలా చేస్తామన్నారు.

February 21, 2026 / 04:17 PM IST

గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీ: డాక్టర్ పద్మావతి

భారతదేశ వైద్యరంగంలో గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి ప్రయాణం స్పూర్తిదాయకం. బర్మా నుండి వలస వచ్చి దేశంలోనే తొలి క్యాత్ ల్యాబ్‌ను స్థాపించి వైద్యరంగంలో విప్లవం తెచ్చారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి, 90 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. గుండె వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.

February 21, 2026 / 04:17 PM IST

HYDలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ పర్యటన

HYD: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ పాటిల్ ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్‌కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఘన స్వాగతం పలికారు. నగరంలోని వివిధ కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

February 21, 2026 / 04:16 PM IST

ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ

JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమి ప్రదేశం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న బండలను తొలగించి, ప్రహరి గోడ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సర్పంచ్‌తో పాటు, మాజీ ఎంపీటీసీ, మాజీ విండో డైరెక్టర్, కుల సంఘల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:15 PM IST

​నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఇంటర్ ప్రశ్నపత్రాలు

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ​నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 04:15 PM IST

ప్రత్యేక తరగతులకు తప్పకుండా హాజరు కావాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.

February 21, 2026 / 04:14 PM IST

ఉచిత బస్సును ప్రారంభించిన కలెక్టర్

NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:13 PM IST

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ట్రస్టు చేయూత

పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 04:13 PM IST

మలేరియా కేసులు తగ్గుతున్నాయి: సత్యకుమార్

AP: రాష్ట్రంలో మలేరియా కేసులు తగ్గుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అల్లూరి, మన్యం జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. దోమల నియంత్రణకు స్ప్రే, ఫాగింగ్, డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 89,845 దోమతెరలు పంపిణీ చేశామని వెల్లడించారు.

February 21, 2026 / 04:12 PM IST

తెలంగాణ సాహితీ ఉత్సవాల్లో జిల్లా రచయితలు

NGKL: హైదరాబాద్ ఏవీ కాలేజీలో ప్రారంభమైన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శనివారం జరిగిన మొదటిరోజు సమావేశంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కథా రచయిత వహీద్ ఖాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లా కవులు తాము రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.

February 21, 2026 / 04:10 PM IST

డ్రిప్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

TG: జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజ పట్టణ పరిధిలో ఒక డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో డ్రిప్ పైపులు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.

February 21, 2026 / 04:10 PM IST