SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.