TG: కామారెడ్డిలో జరిగింది ఇది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందు ఉందని BJP MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. తాను ఎవ్వరినీ రావొద్దంటేనే.. పరిస్థితి ఇలా ఉందని.. ఒకవేళ తానే పిలుపు ఇస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కాలేజీ భూముల విషయంలో దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు తెలుసన్నారు. రేపట్నుంచి గ్రామాల్లో తిరుగుతాని.. తనపై చిన్న గీత పడినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, మరో నలుగురిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు.
PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.
SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద్యార్థులలో పరిశోధనాసక్తిని పెంపొందిస్తాయని కాలేజ్ ప్రిన్సిపాల్ డా జి. సునీత తెలిపారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.
ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తన చాంబర్లో శాలువాతో సత్కరించి సన్మానించి అభినందించారు.
ఉగ్రకుట్రల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్ జారీ చేశారు. పంజాబ్, కాశ్మీర్‌లలో భద్రతాదళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. అమృత్‌సర్‌తో పాటు కాశ్మీర్‌లో లభ్యమైన రెండు IED బాంబులను గంటల వ్యవధిలోనే విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టిన భద్రతాదళాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.
TG: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. సోమవారం కలెక్టరేట్‌కు వస్తా.. తన తప్పు ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలు అడ్డుకున్నందుకే తనపై కక్ష గట్టారని అన్నారు. తన తప్పు రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీపై గౌరవంతో ఇన్ని రోజులు మర్యాద ఇచ్చానన్నారు.
AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్‌లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోందన్నారు. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు Steam Rice సరఫరా చేయనుంది. ప్రస్తుతం అందిస్తున్న సన్నబియ్యం అన్నం ముద్దగా అవుతుండటంతో, విద్యార్థులకు పొడిపొడిగా, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
BDK: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సేవ చేయడం గొప్ప లక్షణం విద్యార్థి దశనుంచే సేవలు చేసే గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బొజ్జాయిగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.
MLG: CM రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10గం కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై CM పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్నెళ్ల తర్వాత జరిగిన MP ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 27 శాతం పెరిగిందన్నారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందన్నారు.
MDK: శివంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫౌండేషన్, గురుకులం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’ కార్యక్రమ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు మార్గదర్శనం చేయడానికి కార్యక్రమం చేపట్టినట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు.