• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి’

WNP: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 12:07 PM IST

అదరగొట్టిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలోని ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ రిలీజైన 24 గంటల్లోనే 11.44 మిలియన్ వ్యూస్ సాధించి, ‘పుష్ప-2’లోని  ‘సూసేకి’ పాట రికార్డును (10.97M) అధిగమించింది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది.

February 24, 2026 / 12:07 PM IST

‘కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదు’

KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు సదాశివనగర్ TS మోడల్ స్కూల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని తెలిపారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలని, విటమిన్లు ఉన్న పోషక పదార్థలను తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 12:06 PM IST

T20 ప్రపంచకప్: భారత్ సెమీస్ చేరాలంటే..?

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచులో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ నెట్ రన్ రేట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలి. అప్పుడు రన్ రేటుతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

February 24, 2026 / 12:04 PM IST

మీడియా ప్రజల గొంతుకగా నిలవాలి: డా.వ్యాసభట్

MDCL: మీడియా ప్రజల గొంతుకగా నిలవాలని తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం ఛైర్ పర్సన్ డా.వ్యాసభట్ శ్రీవాణి చౌదరి అన్నారు. ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఉప్పల్ అభివృద్ధికి మీడియా నిర్మాణాత్మక సహకారం అవసరమని పేర్కొన్నారు.

February 24, 2026 / 12:03 PM IST

గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు

NTR: సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబు ఆదేశాలతో ధర్నా చౌక్ మీదగా వచ్చేవారు, అలంకార సెంటర్ మీద నుంచి గాంధీనగర్ వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్సై సరళ, ఎఎస్సై మెహర్ బాబు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.

February 24, 2026 / 12:02 PM IST

రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం

కృష్ణా: రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చేయటం ముదావహం అని టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాకు మచిలీపట్టణంకు చెందిన స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంబేగ్ చొరవతో దాతలు రూ.15వేలు విలువైన బియ్యం, సరుకులు అందచేశారు. మోర్ల శివ, షేక్ నబీఘోరీ, అమీర్ జానీ పాల్గొన్నారు.

February 24, 2026 / 12:02 PM IST

‘పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు’

SRCL: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చెయ్యనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. పరీక్షలకుముందు AM 9 గంటల నుంచి PM 12 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు TGBIE వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.అన్నారు

February 24, 2026 / 12:01 PM IST

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతలను అభినందించిన ఎమ్మెల్యే

ATP: రామాయణాన్ని వర్లి చిత్రకళ ద్వారా వినూత్నంగా చిత్రీకరించిన డాక్టర్ ఎం.వరలక్ష్మి, సాయి దీపికలను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. వర్లి ఆర్ట్ నుంచి తెలుగు అక్షరమాలతో రామాయణాన్ని సృజనాత్మకంగా రూపొందించినందుకు వీరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. పాపంపేటకు చెందిన వీరిద్దరూ సాధించిన మెడల్స్, జ్ఞాపికలను చూసి ఎమ్మెల్యే ప్రశంసించారు.

February 24, 2026 / 12:01 PM IST

కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మరోసారి వాయిదా

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణకు రాలేనంటూ కాకాణి కోవూరు పోలీసులకు లేఖ రాశారు. ఈనెల 27వ తేదీన విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. బాలిక మృతి కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కాకాణిపై కేసు నమోదైంది. ఇప్పటికే విచారణ రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

February 24, 2026 / 12:01 PM IST

వీడని స్నేహం! ఇద్దరు స్నేహితుల మృతి

సిద్దిపేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ అటెండర్ బొమ్మల పృథ్వీరాజ్, తన స్నేహితుడు నవీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

February 24, 2026 / 11:59 AM IST

మాజీ మంత్రిపై మండిపడ్డ ఇంఛార్జ్ మేయర్

NLR: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై నెల్లూరు ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో రూ.వందల కోట్లు సంపాదించి.. నమ్ముకున్న క్యాడర్ను వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు. స్రవంతి మేయర్‌గా ఉన్న సమయంలో ఆమెను సిటీ నియోజకవర్గంలోని రానీయకుండా మూడేళ్లు అనిల్ అడ్డుకున్నారని ఆరోపించారు.

February 24, 2026 / 11:59 AM IST

ఖమ్మంలో కూల్చివేతలు.. ఖండించిన హరీష్ రావు

TG: ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వినోభానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..?లేక పోలీస్ రాజ్యమా..? అని ప్రశ్నించారు. వేల మంది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చారని.. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని చెప్పి.. ఉన్న ఇళ్లనే కూల్చుతున్నారని మండిపడ్డారు.

February 24, 2026 / 11:59 AM IST

ఈ నెల 2న వాహనాలకు వేలం పాట

ADB: ఎక్సైజ్ శాఖ పరిదిలో పలు కేసులలో పట్టుబడిన 15 ద్విచక్రవాహనాలు,1 ఆటోను వేలం పాట నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ ఎక్సైజ్ ఆవరణలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని హిమాశ్రి ఆధ్వర్యంలో వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ప్రభుత్వం నిర్దేశించిన ధరావత్ సొమ్మును చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు.

February 24, 2026 / 11:57 AM IST

ఈ నెల 26 న శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ

NGKL: అచ్చంపేట నియోజకవర్గం పదర గ్రామంలో ఈ నెల 26న శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ హాజరవనున్నారని చెప్పారు.

February 24, 2026 / 11:57 AM IST