• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం

అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ వెంటనే చేయడం వలన మనిషిని బతికించే అవకాశాలు పెరుగుతాయని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం మొబైల్ హెల్త్ టీమ్స్ కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొబైల్ హెల్త్ టీమ్ సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించామన్నారు.

February 24, 2026 / 04:01 PM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడుకి గాయాలు

KNR: కులవృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడటంతో ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. రామడుగు మండలంలోని చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర లచ్చయ్య గౌడ్ మంగళవారం ఉదయం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 04:01 PM IST

ఆసీస్‌తో తొలి వన్డేలో భారత్ ఓటమి

ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 214 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని 38.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో అలిస్సా హీలీ(50), బెత్ మూనీ(76) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. కాగా, రెండో వన్డే ఈనెల 27న జరగనుంది.

February 24, 2026 / 04:00 PM IST

ప్రభుత్వ భూములను కాపాడాం: గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనుపర్తిపాడులో రూ.22.50 లక్షలతో ఎస్టీ కాలనీ శ్మశానానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఈ పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడమని చెప్పారు.

February 24, 2026 / 04:00 PM IST

అనంతపురంలో చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు

అనంతపురం డీఈఐసీ కేంద్రాన్ని ప్రోగ్రాం అధికారి డా. విష్ణుమూర్తి సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు డా.నాగ శశిభూషణ రెడ్డి సమక్షంలో మాత్రలు అందజేశారు. అలాగే 28 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

February 24, 2026 / 04:00 PM IST

విద్యార్థులకు మానసిక సమస్యలపై అవగాహన

కామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మానసిక సమస్యలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు HM రమణా రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కాలంలో ప్రణాళిక వేసుకొని సంసిద్ధమై, నేర్చుకున్న అంశాలను పునఃశ్చరణ చేయడం ద్వారా మానసిక సమస్యలను అధిగమించవచ్చు అన్నారు.

February 24, 2026 / 04:00 PM IST

ఎంపీ అర్వింద్‌కు కీలక బాధ్యత

NZB: పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా NZB ఎంపీ అర్వింద్ మంగళవారం నియమితులయ్యారు. ఈ గ్రూప్ ద్వారా భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

February 24, 2026 / 04:00 PM IST

పోలీస్ విజేతలను సత్కరించిన ఎస్పీ

NLG: 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో NLG జిల్లా పోలీస్ సిబ్బంది పలు విభాగాల్లో మెడల్స్ సాధించి ప్రతిభ చాటారు. ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజేతలను అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

February 24, 2026 / 04:00 PM IST

పింఛన్ మంజూరు చేయాలంటూ భార్య వినతి

CTR: అరగొండ ఏ.గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నందున పింఛన్ మంజూరు చేయాలని ఆయన భార్య లోకేశ్వరి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శస్త్రచికిత్స అనంతరం భర్త చేతులు, కాళ్లు పనిచేయక కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె కోరారు.

February 24, 2026 / 03:58 PM IST

పసికందును పొయ్యిలో వేసి చంపిన తల్లి

TG: HYDలోని దుండిగల్ బౌరంపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి రెండు నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి చంపింది. ఆ చిన్నారి అరుపులు ఎవరికీ వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసింది. ఈ ఘటనసై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ చిన్నారిని చంపడానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు.

February 24, 2026 / 03:57 PM IST

‘కపుల్ ఫ్రెండ్లీ’ 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.

February 24, 2026 / 03:57 PM IST

మూసీ ప్రాజెక్టు భూసేకరణపై కీలక నిర్ణయం

TG: మూసీ ప్రాజెక్టు భూసేకరణపై రాజేంద్రనగర్ RDO కీలక సమావేశం నిర్వహించారు. ‘కిస్మత్‌పురా, దర్గా ప్రాంతానికి నోటిఫికేషన్లు ఇచ్చాం. భూసేకరణ కోసం బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లిలో నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. బఫర్‌జోన్‌లో పరిహారం ఇచ్చి మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌తో పాటు మూసీకి 50 మీ లోపున్న నివాసాలు స్వాధీనం చేసుకుంటాం’ అని వెల్లడించారు.

February 24, 2026 / 03:55 PM IST

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది: హోంమంత్రి

AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని తెలిపారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ‘ఈగల్’ అనే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 24, 2026 / 03:52 PM IST

కల్తీ పాలపై అవగాహన

NTR: పాల కేంద్రాల్లో పాలు కల్తీ జరగకుండా, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై పశుసంవర్ధక శాఖ వైద్యుడు అభిలాష్ మంగళవారం తిరువూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు కల్తీయా కాదా అని గుర్తించే విధానాలపై పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కల్తీ పాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.

February 24, 2026 / 03:51 PM IST

నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి

జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన ఆకాల వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షానికి నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు.

February 24, 2026 / 03:48 PM IST