• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి నుంచి రంజీ ఫైనల్.. కర్ణాటక Vs జమ్మూ

ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటక.. తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ రంజీ ఫైనల్‌లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పడిక్కల్‌, స్మరణ్‌ లాంటి బ్యాటర్లతో కర్ణాటక బ్యాటింగ్ లైనప్‌ బలంగా ఉంది. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం వారికి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరం. J&K తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా చూడాలి.

February 24, 2026 / 09:12 AM IST

నిర్లక్ష్యం నీడలో నర్సరీ.. ఎండిపోతున్న మొక్కలు

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కోటపహాడ్ నర్సరీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం మొక్కల పెంపకానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. నర్సరీలోని మొక్కలకు సకాలంలో నీళ్లు పోయకపోవడంతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 09:11 AM IST

రైతులను తిప్పలు పెడుతున్న పర్ఫాల్ స్వాపెన్ పక్షులు

NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని ఈ పక్షులు జీవిస్తాయి.

February 24, 2026 / 09:10 AM IST

‘అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలి’

KRNL: చిలకలడోన గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ ప్లాట్లు, గుడిసెలను తొలగించాలని ఎస్సీ కాలనీవాసులు జిల్లా సబ్ కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనపరచి, స్థలంలేని నిరుపేద కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:10 AM IST

జిల్లాలో పంచాయతీ సర్పంచులకు మూడో విడత శిక్షణ ప్రారంభం

BHPL: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ భవనంలో నేటి నుంచి పంచాయతీ సర్పంచులకు మూడో విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మహాముత్తారం, మలహర్, పలిమెల మండలాలకు చెందిన సర్పంచులకు ఈ తుది విడత శిక్షణ 28వ తేదీ వరకు జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థ బలోపేతం, అభివృద్ధి పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.

February 24, 2026 / 09:10 AM IST

స్కాలర్షిప్ కు ఘనపూర్ విద్యార్థి ఎంపిక

MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చేతన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరైంది. విద్యార్థికి 8, 9 తరగతులతోపాటు, ఇంటర్మీడియట్లో రూ. 1000 స్కాలర్షిప్ లభించనున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.

February 24, 2026 / 09:10 AM IST

‘ నిల్వల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు’

KMM: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లను ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలు, నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బియ్యం రక్షణకు రసాయనాల వినియోగంపై అధికారులకు సూచనలు చేశారు.

February 24, 2026 / 09:09 AM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. సామాగ్రి దగ్ధం

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని ఇప్ప లత ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సామాగ్రి కాలిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టలు, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిజ్, రూ.50వేలు, అర తులం బంగారం, కుమారుడి స్టడీ సర్టిఫికెట్స్ కాలి బూడిద అయ్యాయన్నారు. అధికారులు స్పందించి నిరుపేదలమైన తమకు సాయం చేయాలని వేడుకున్నారు.

February 24, 2026 / 09:09 AM IST

చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

HYD: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

February 24, 2026 / 09:08 AM IST

బాలానగర్ HAL ఉద్యోగులకు క్షయ, షుగర్ పరీక్షలు

MDCL: జిల్లా వ్యాప్తంగా జీరో టీబీ లక్ష్యంగా DTO అధికారిక యంత్రం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగానే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉద్యోగులకు క్షయ, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొంది. అత్యధిక టెక్నాలజీతో కూడిన ఏఐ ఎక్స్ రే ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించడం జరుగుతుందని డాక్టర్ సంధ్య పేర్కొన్నారు.

February 24, 2026 / 09:08 AM IST

పీజీఆర్ఎస్ కు 127 అర్జీలు

SKLM: అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించారు. 127 అర్జీలు ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ , గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

February 24, 2026 / 09:06 AM IST

564 పోస్టులు.. మంత్రివర్గం ఆమోదం

TG: వైద్యారోగ్యశాఖలో 434 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఒక్కోదానికి 31 చొప్పున పోస్టులున్నాయి. వైద్యారోగ్య నియామక మండలి భర్తీ చేయనుంది. వీటితో పాటు జలమండలికి 130 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో మేనేజర్, ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటిని TGPSC ద్వారా భర్తీ చేస్తారు.

February 24, 2026 / 09:06 AM IST

రైల్వే స్టేషన్ వద్ద వృద్ధుడి మృతి

నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు CI నంబర్ 91211 01088కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 24, 2026 / 09:05 AM IST

కొత్త సొసైటీల ఏర్పాటు పై కసరత్తు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. (NLG-42, SRPT-44,YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొత్త గ్రామాలను విడదీసి కొత్త వాటిల్లో విలీనం చేయనున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి

TPT: ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేశారు. దర్శనం అనంతరం ధూర్జటి కళా ప్రాంగణంలో విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతిసారి స్వామి వారిని దర్శించుకోవడం నా భాగ్యమని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగ్గా అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు.

February 24, 2026 / 09:04 AM IST