TG: క్యాతన్‌పల్లిలో స్పష్టమైన మెజార్టీతో గెలిచామని మాజీమంత్రి KTR అన్నారు. ‘మా వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారు. అధికార పార్టీకి మావాళ్లు లొంగలేదు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.3 కోట్లు ఆఫర్ చేశారు. పొత్తు ధర్మం పాటిస్తున్న CPIకి ధన్యవాదాలు. జైలులో పెడితే భయపడే నేత కాదు బాల్కసుమన్. క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌లో మళ్లీ ఎన్నికలు పెట్టాలి’ అని అన్నారు.
ASR: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సలుముర్తి సూరిబాబు డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కొయ్యూరులో అంగన్వాడీలు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీల ధర్నాకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న ఉదయ్‌పుర్‌లో ఘనంగా వివాహం చేసుకోనున్నారు. వీరి పెళ్లి తెలుగు, కన్నడ (కొడవ) సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం కన్నడ సంప్రదాయంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు. దీంతో ఒకేరోజు వీరిద్దరూ రెండుసార్లు వివాహం చేసుకోబోతున్నారు. కాగా, మార్చి 3న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
AP: కూటమి ప్రభుత్వంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ఫైర్ అయ్యారు. ‘ఏడుకొండలను YSR రెండు కొండలు చేయాలని కుట్ర చేసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏడుకొండలు శ్రీవారివే అని దివంగత YSR జీవో ఇచ్చారు. గతంలో బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన జీవోను YSR సవరించారు’ అని భూమన వెల్లడించారు.
అన్నమయ్య: ఓ 11నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలా మంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు.
W.G: ఆకివీడు నగరపంచాయతీ 3 వార్డు వైసీపీ పార్టీకి చెందిన అందే పెద్దిరాజు చాలా కాలం నుంచి ఫంక్రటీస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రక్తనాళం బ్లాక్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతూన్నాడు. హాస్పిటల్‌లో చూపించుకుంటే వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పడంతో సియం ఆర్ ఎఫ్ నుండి ఆపరేషన్ కు 1,71,000 ల చెక్కును వినోద్ వర్మ అందజేశారు.కార్యక్రమం లో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
NDL: తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని YCP మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాటసాని పిటిషన్‌పై CJI ధర్మాసనం విచారణ జరిపింది. కాటసానికి భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరోసారి సమీక్షించాలని ధర్మాసనం సూచించింది. భద్రత అవసరమో, కాదో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
PDPL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సుల్తానాబాద్ పట్టణంలో 99 మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
NRPT: ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం స్థానిక వార్డు సభ్యులు సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం వండకపోవడం, నాణ్యత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు, కాలువలు, స్మశాన వాటిక నిర్మాణాలకు మంగళవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌సీ సబ్ ప్లాన్ నిధులతో 8వ వార్డు శ్రీకంఠపురం, 27వ వార్డు అంబేడ్కర్ నగర్, 4వ వార్డు త్యాగరాజ నగర్, 33వ వార్డు మేళాపురం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు డీఐఈవో ఎం.వినోద్ బాబు తెలిపారు. 34 పరీక్షా కేంద్రాల్లో 12,422 మంది హాజరుకావాల్సి ఉండగా 12,203 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 219 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసేమని వారు తెలపారు.
GDWL: 70 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పక్షపాత వైఖరికి నిదర్శనం అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం గద్వాల ఎంఆర్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.
కోనసీమ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన రెండేళ్ల చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వాలని రామచంద్రపురం మండలం అన్నాయిపేటకు చెందిన చిన్నారులు మంగళవారం విరాళాలు సేకరించారు. చిన్నారికి రూ.16 కోట్లు విలువచేసే ఇంజక్షన్ అవసరమని తెలిసి విరాళాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.20 వేలు సేకరించామన్నారు.
MNCL: రాబోయే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి తీసుకురావడం వరకు భద్రత కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలుగు చిత్రసీమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అత్యధికంగా 7 అవార్డులతో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. వీరి తర్వాత మహేష్ బాబు (5), శోభన్ బాబు, వెంకటేష్ (చెరో 4), ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడు అవార్డుల చొప్పున అందుకున్నారు.