• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే

KNR: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు శాలువాలు కప్పి సన్మానించారు.

February 24, 2026 / 05:02 PM IST

ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన

NGKL: జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో ఎస్సై మాధవరెడ్డి వాహనదారులకు మంగళవారం ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సిగ్నల్స్ పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

February 24, 2026 / 05:02 PM IST

వయోజన విద్యా DDగా వెంకట్ రెడ్డి

MDK: ఉమ్మడి జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌గా కె.వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఇంఛార్జ్ డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు.. పదోన్నతి కల్పిస్తూ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం తన నూతన బాధ్యతలను చేపట్టారు.

February 24, 2026 / 05:02 PM IST

రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి: AITUC

NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల రాష్ట్ర మహాసభ ఈనెల 28న వరంగల్‌లో జరగనున్నట్లు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మెడికల్ కాంటాక్ట్ కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 24, 2026 / 05:02 PM IST

అతిగా హెడ్ ఫోన్లు వాడుతున్నారా..?

ఇయర్ బడ్లు, హెడ్ ఫోన్ల అతి వాడకం వల్ల ఇన్ఫెక్షన్లు, టిన్నిటస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికి నిపుణులు 60:60 నియమాన్ని సూచిస్తున్నారు. అంటే 60 శాతం వాల్యూమ్ వద్ద, కేవలం 60 నిమిషాలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత చెవులకు విశ్రాంతి ఇవ్వడం వల్ల వినికిడి శక్తిని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 05:02 PM IST

‘కుబీర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

NRML: కుబీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరిడెంట్ విజయ్ భాస్కర్, DO నర్సయ్య తెలిపారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం జనరల్ 132, ఒకేషనల్ 27 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 112 మంది విద్యార్థులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు.

February 24, 2026 / 05:01 PM IST

‘పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

MBNR: జిల్లాలో SSC,ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

February 24, 2026 / 05:01 PM IST

ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ విప్

SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్‌ను అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధితో ఆశీర్వదించారన్నారు.

February 24, 2026 / 05:01 PM IST

జీఎంసీ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఉండాలి: కమిషనర్

GNTR: నిర్మాణాలు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్ ప్రకారమే ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. మంగళవారం శ్యామలానగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను ఆయన పరిశీలించారు. పనులు ప్లానింగ్‌కు అనుగుణంగా సాగేలా కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

February 24, 2026 / 05:00 PM IST

తెలుగు అధ్యయన శాఖ బోర్డర్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య

NZB: TUలోని తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా ఆచార్య కనకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆడిట్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రిన్సిపల్, డీన్, విభాగాధిపతిగా వ్యవహరించారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు అభినందించారు.

February 24, 2026 / 05:00 PM IST

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా పర్యాటక అధికారి నరసింహ మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాలేశ్వరయ్య (రూ. 12 వేలు), స్వామి (రూ.21 వేలు), షామా (రూ.9 వేలు)లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

బాధిత మహిళకు సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

అనంతపురంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అందజేశారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఆమెకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,462 మంజూరయ్యాయి. బాధితురాలి సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఎంపీ తెలిపారు.

February 24, 2026 / 05:00 PM IST

సూర్యలంక బీచ్‌లో పర్యాటకుల అవస్థలు

BPT: సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్ రూమ్ ఉన్నా అధికారులు దానిని ఇంకా తెరవలేదు. పంచాయతీ అధికారులు వేలం నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పర్యాటకులు తమ సామాన్లను ఇసుకలోనే ఉంచాల్సి వస్తోంది. కొన్నిసార్లు వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 05:00 PM IST

మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల భరోసా

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రాంబాబు మృతి చెందడంతో ఆయన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సమయంలో తామున్నామంటూ భరోసా ఇస్తూ మిత్రులందరూ కలిసి ఇవ్వాళ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

February 24, 2026 / 05:00 PM IST

ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎన్ఎంయూ ధర్నా

PLD: వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. 12 డిపోలను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థే సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, తమ సిబ్బందితో నడపాలని నేతలు శ్రీనివాసరావు, సౌభాగ్యరాజు డిమాండ్ చేశారు. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు.

February 24, 2026 / 05:00 PM IST