• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఔషధ దుకాణాలకు నోటీసులు

ELR: ఉభయ గోదావరి జిల్లాల్లోని 44 మెడికల్ షాపులపై సోమవారం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏలూరు రీజియన్ ఉప సంచాలకులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే మందులు కొనుగోలు చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:57 AM IST

విద్యార్థులకు చట్టాలపై షీ టీమ్ అవగాహన

NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ (SHE Teams) పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి స్వయం సమృద్ధి సాధించాలని పోలీసులు బాలరాజ్, చెన్నప్ప, జ్యోతి పేర్కొన్నారు.

February 24, 2026 / 07:56 AM IST

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో కాంస్య పతకం

NGKL: HYDలోని జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ అధికారుల టీమ్ ఈవెంట్‌లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. విజేతలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 07:55 AM IST

‘హత్య కేసులో నిందితుడి అరెస్ట్’

PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఇటీవల మొలుగూరి కొమురయ్యపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు బుర్ర రాజ కొమురయ్యను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. పాత కక్షలతో తమ్ముడిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన అన్న కొమురయ్య పై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.

February 24, 2026 / 07:55 AM IST

ఈ నెల 28, 29 తేదీల్లో వయోజన విద్యా పరీక్షలు

ELR: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న ప్రీ-ఫైనల్, 29న ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో దాదాపు 97,200 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.

February 24, 2026 / 07:53 AM IST

T20 WC: పాకిస్తాన్ జ‌ట్టుకు చావో రేవో

టీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో గెలిస్తే పాక్ మొదటి స్థానానికి వెళ్తుంది. ఓడితే, పాయింట్ల పట్టికలో మరింత దిగజారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బరిలో ఉంటాయి. అందుకే ఇవాళ్టి మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది. కాస్త అజాగ్రత్తగా ఆడినా.. మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లిపోతుంది.

February 24, 2026 / 07:50 AM IST

అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు శిక్షణ

WNP: అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, డయాబెటిస్ రోగులకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి DMHO సాయినాథెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. అందుకు సంబంధించి సోమవారం DMHO కార్యాలయంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. బీపీ, షుగర్కు మందులను పీహెచ్సీలో అందుబాటులో ఉంచి, జీవనశైలి మార్పులపై అవగాహన పెంచాలన్నారు.

February 24, 2026 / 07:49 AM IST

MPTC ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదిస్తేనే.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే నెల 3 నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2 వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు.

February 24, 2026 / 07:49 AM IST

’25న దివ్యాంగుల కలెక్టరేట్ ముట్టడి’

SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 24, 2026 / 07:48 AM IST

‘గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.

February 24, 2026 / 07:47 AM IST

చిన్నారితో ముచ్చటించిన తేజస్ పవర్..

SRPT: అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. పాప పేరు అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఆమెను అంగన్‌వాడీకి పంపిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

February 24, 2026 / 07:46 AM IST

మైపాడులో అక్రమంగా మట్టి తవ్వకాలు

NLR: ఇందుకూరుపేట మండలం పరిధి మైపాడు బీచ్ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచే మట్టిని లారీలు, హిటాచీలతో లే-అవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సిబ్బందిని పంపించి విచారణ చేపడతామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 07:45 AM IST

100 లీటర్ల పాలలో.. 10 కేజీల యూరియా..?

AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. మరికొన్నిచోట్ల కల్తీ పాల దందా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. కాగా, రాజమండ్రిలో 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా కలిపినట్లు సమాచారం. అయితే తెలుగురాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

February 24, 2026 / 07:45 AM IST

మరోసారి విచారణకు రాలేనంటూ మాజీ ఎమ్మెల్యే లేఖ

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు సార్లు పోలీసులు విచారణను వాయిదా వెయ్యగా ఈసారి మాజీ మంత్రి కాకాణి వంతు వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 24న విచారణకు రాలేనంటూ ఆయన సోమవారం పోలీసులకు లేఖ రాశారు. 27వ తేదీన వస్తానని పేర్కొన్నారు. కొన్ని రోజుల కింద బాలిక మృతి ఘటనలో ఆయనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 07:43 AM IST

పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: కలెక్టర్

NLG: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 AM IST