KKD: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామ శివార్లలో అక్రమంగా గుండాట ఆడుతున్న ఆరుగురిని సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు SI లక్ష్మీ కాంతం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 15,700 నగదు, గుండాట ఫ్లెక్సీ, రెండు లెదర్ బౌల్స్, తొమ్మిది పాశాలను స్వాధీనం చేసుకున్నారు.
AP: అసెంబ్లీలో ఇవాళ కల్తీ నెయ్యిపై చర్చించనున్నారు. బడ్జెట్‌లో శాఖలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. ఆయా శాఖల డిమాండ్ల ఆమోదం కోసం సభలో ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై చర్చించినున్నట్లు సమాచారం. మండలిలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈనెల 26న చర్చ జరగనుంది.
SKLM: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో అండర్ 18 విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు https://sports.ap.gov.in వెబ్సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం బురుజుపల్లి తాండాకు చెందిన గణేష్ నాయక్ కృష్ణాజిల్లా పెనమలూరులో రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గణేష్ నాయక్ పెనమలూరులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గణేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గిద్దలూరులో గోబీ బండి నడుపుకుంటూ గణేష్ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.
MBNR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి ఇంటిపై దాడికి కార్యకర్తలను ప్రేరేపించారని సోమవారం MBNR ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఎంపీ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరాధార ఆరోపణలు చేయడం సులభమని, వాటిని రుజువు చేయాలేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.
SKLM: చీపురుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం ఉదయం వేలాది నంది భక్తులు దర్శించారు. అనేక ప్రాంతాల నుంచి వంట పాత్రలతో చేరుకుని అన్నప్రసాదాలు స్వయంగా చేపట్టి స్వీకరిస్తారని స్థానికులు తెలిపారు. ఎంతో అద్భుతంగా అమ్మవారి అలంకరణ అందరిని ఆకట్టుకుంది.
NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో రూ.20 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ దాములూరు గ్రామంలో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని,వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా పైప్ లైన్ నిర్మిస్తున్నామన్నారు.
VKB: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. బస్సు సేవలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఉదయం నిర్ణీత సమయంలో 9959225253 నంబర్‌కు నేరుగా కాల్ చేసి సూచనలు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.
JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురంలో విద్యుత్ షాక్‌తో రెండు మూగజీవాలు మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వెనుక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్ల ఐలయ్యకు చెందిన ఒక మేక, ఒక గొర్రె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయన్నారు.
ELR: లింగపాలెం మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలను పరిశీలించడంతో పాటు, ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి వివరాలను సరిచూశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు.
RR: భూ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేశారు. మాజీ ఎంపీటీసీ గౌర మల్లేశ్ ప్రజలందరిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు. సభ్యులు శశిధర్ రెడ్డి, నరసింహ, ఇతరులన్నారు.
కోనసీమ జిల్లా డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు సోమవారం సాయంత్రం అమలాపురంలో ఎంపీ గంటి హరీశ్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
కడప: ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ నిన్న విస్తృత కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి అవగాహన కల్పించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవనం గడపాలని సూచించారు.
HYD: GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తిరిగి తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్‌నగర్‌లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్టీవో కాలనీ, శాస్త్రిపురం, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైంది.
NDL: శ్రీశైలం (NSRS) ప్రాజెక్టు నిర్వాసితుల ప్రత్యేక పునరావాస విధానం కింద నియమితులైన జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్‌లకు CPT టెస్ట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా కారుణ్య నియామకాలు కాకుండా ప్రత్యేక విధానంలో సోమవారం చేసిన నియామకాలని వెల్లడించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు.