SRPT: కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు మాదిగ జిల్లా కమిటీని రద్దు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ఉద్యమానికి జిల్లా కమిటీ నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు.
MDK: తూప్రాన్‌లోని గీతా స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహతి తయారు చేసిన ‘వ్యర్ధాల నిర్వహణ- ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయితోపాటు, జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.
ADB: పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు రూ. 5 వేల రివార్డు సాధించడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. శిశు ఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటును గణనీయంగా తగ్గించడంలో మంచి ఫలితాలను సాధించాలని కొనియాడారు. ఈ మేరకు సిబ్బందిని ఆయన అభినందించారు.
KRNL: రాష్ట్ర బడ్జెట్ రైతులకు ఉపయోగపడకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) మరియు కౌలు రైతు సంఘం విమర్శించాయి. ఈనెల 23వ తేదీ సోమవారం ఆదోనిలో ఎమ్మార్వో (2) కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. 2026–27 బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంపీవో గోవర్ధన్ మాట్లాడుతూ.. గత ఐదు రోజుల నుంచి నేర్చుకున్న అంశాలను వార్డు సభ్యులు ఆయా వార్డులలో ఆచరణలో పెట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లను వార్డు సభ్యులకు అందజేశారు.
MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్, RK-1, సుభాష్ నగర్ ఏరియాల్లో గత 15 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన పైపులైన్లు పగిలిపోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ రాయలింగు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, మరో వారం రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.
PPM: గంజాయి, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. శనివారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులలో అనుమానాస్పద వ్యక్తులు కనపడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిపో మేనేజర్ పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్ లో 131 మంది పోలీసు సిబ్బందికి ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బెటాలియన్ కమాండ్మెంట్ K.ఆనంద రెడ్డి తెలిపారు. బెటాలియన్ ఆవరణలోని కళ్యాణ మండపంలో శనివారం కడప నగరానికి చెందిన హరిప్రియ డెంటల్ హాస్పిటల్ వైద్యులు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
NZB: అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ బాబు స్పష్టం చేశారు. శనివారం సాలూర పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక టారస్ లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
KMM: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కారేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాంత్, సురేష్, యాదగిరిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు CI సాగర్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 100 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు.
WGL: నల్లబెల్లి మండలం మేడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ASF: జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తిని రైతులు రాబోయే రెండు రోజుల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
AP: లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈనెల 27 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డి ఏ2గా ఉన్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
PLD: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేశారు. వేసవిలోపు తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేయాలి. పారిశుధ్యం మెరుగుపరచాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేయాలి. ఖాళీ స్థలాలపై పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు.