• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎంఈవోగా జయప్రద నియామకం

KNR: చిగురుమామిడి మండల విద్యాశాఖాధికారిగా ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎంఈవోగా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

February 22, 2026 / 07:19 AM IST

‘YVU అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలి’

కడప YVU అభివృద్ధికి నిధులు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షులు D. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఆగిపోయిన పరిపాలన భవనం, హాస్పిటల్ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అలాగే, వర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు, అడ్మిషన్లు పెంచేందుకు ఉమ్మడి పీజీ సెట్‌ను రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 07:18 AM IST

‘నాణ్యమైన వస్తువులను కొనాలి’

ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలుచేయాలని ముంచంగిపుట్టు SI నాని ప్రజలకు సూచించారు. శనివారం ఆయన ముంచంగిపుట్టు వారపు సంతను సందర్శించారు. వారపు సంతల్లో కల్తీలేని, నాణ్యమైన సరుకులు విక్రయించాలని వ్యాపారులు, దుకాణాదారులకు సూచించారు. తూకాలు, కొలతలు సక్రమంగా ఉండాలన్నారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

February 22, 2026 / 07:15 AM IST

శ్రీసిటీని సందర్శించిన మాజీ డీజీపీ

TPT: మాజీ డీజీపీ డా. ఎం.మాలకొండయ్య శనివారం శ్రీసిటీని సందర్శించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ఇతర కార్యకలాపాలను వివరించగా.. విజన్, ప్రణాళిక, అమలు తీరును ప్రశంసించిన ఆయన దేశంలో ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ నిలుస్తుందని కొనియాడారు.

February 22, 2026 / 07:13 AM IST

నేడు మండలానికి తీన్మార్ మల్లన్న రాక

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో కుల్మోనాదుల దాడిలో రెండు నెలల చిన్నారి మరణించిన ఘటనపై టి.ఆర్.పి చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు కుమ్మెర వస్తున్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

February 22, 2026 / 07:12 AM IST

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవం సందర్భంగా తొలి పూజ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:12 AM IST

పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలు: SI

ADB: పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు నిందితులు మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ SI విష్ణువర్ధన్ తెలియజేశారు. నిన్న సిబ్బందితో సమావేశమై వివరాలను వెల్లడించారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 22, 2026 / 07:11 AM IST

తాగునీటి నివారణకు క్రాష్ ప్రోగ్రాం

AKP: కోటవురట్ల మండలంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు క్రాష్ ప్రోగ్రాం చేపట్టినట్లు ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో 495 హ్యాండ్ బోర్లు ఉన్నాయన్నారు. బోర్ మెకానిక్‌లు రోజు రెండు మూడు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులకు గురైన బోర్లకు 24 గంటల్లో రిపేర్లు చేస్తున్నారన్నారు. అలాగే 45 మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు.

February 22, 2026 / 07:10 AM IST

పిట్లం DROపై సస్పెన్షన్ వేటు

KMR: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, అటవీ భూముల రక్షణలో విఫలమైన పిట్లం రేంజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అభిలాష్‌‌పై వేటు పడింది. ఈ మేరకు రాజన్న సర్కిల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అర్పణ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన పిట్లం రేంజ్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

February 22, 2026 / 07:10 AM IST

విశాఖపట్నంలో నేటి చికెన్ ధరలు

విశాఖపట్నంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సాధారణంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹230–₹235కు, స్కిన్‌లెస్ చికెన్ ₹235కు, బోనెలెస్ చికెన్ సుమారు ₹260 వరకు విక్రయించబడుతోంది. షాపులు మరియు డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది పేర్కొన్నారు .

February 22, 2026 / 07:10 AM IST

నేడు నాయుడుపేటలో పవర్ కట్

TPT: నాయుడుపేట పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివశంకర్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు బీఎంఆర్ నగర్, బాలాజీనగర్, బోపయ్యకాలనీ, అగ్రహారం, ఆవనిహోమ్స్, కాళహస్తి రోడ్డు, పెట్రోల్ బంక్, రాజగోపాలపురం, బస్టాండ్, శ్రీరామ్ నగర్, జూవ్వలపాలెం, అశోక్ నగర్‌లో సరఫరా ఉండదని, ఈ మేరకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

February 22, 2026 / 07:10 AM IST

‘గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ’

PDPL: జిల్లాలోని గ్రామీణ యువతకు RSETI పెద్దపల్లి ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ రాకేష్ తెలిపారు. మగ్గం వర్క్, క్రియేటివ్ జువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్ స్టాల్, మొదలగు కోర్సులలో శిక్షణ పొందుటకు సంస్థలో, 9392221907 నంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.

February 22, 2026 / 07:07 AM IST

ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపాల్

BHPL: బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లింగాల MJP ప్రిన్సిపల్ జి. విజయ తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించినట్లు, పరీక్షా హాల్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలు సిద్ధం చేశామని వెల్లడించారు.

February 22, 2026 / 07:06 AM IST

టెక్కలిలో ఒడిశా దొంగ అరెస్ట్

SKLM: ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన దొంగను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ డి. లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కలి జగతి మెట్ట కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడి నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 22, 2026 / 07:06 AM IST

దుబాయిలో యువకుడి మృతి.. ఎమ్మెల్యేను ఆశ్రయించిన కుటుంబం

JN: మాన్సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీను ఉపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ మృతి చెందాడు. బాధితుడి బంధువులు, స్థానిక నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, మృతదేహం త్వరగా చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు

February 22, 2026 / 07:06 AM IST