GDWL: గద్వాల కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన దివ్యాంగుల గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు అందినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి నెల మూడో శనివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారని తెలిపారు.
GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 61 మందికి రూ. 46,59,619ల విలువైన చెక్కులను శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.
అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారు. దీనికి వారు సిగ్గుపడాలి. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు. మేం గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటాం’ అని వెల్లడించారు.
BPT: రేపల్లె పట్టణంలో శనివారం ఆర్డీవో ఎన్ రామలక్ష్మి ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీరో వెస్ట్–లిట్టర్ ఫ్రీ గవర్నెన్స్ లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అనగాని శివ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.
MBNR: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని జిల్లా ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధి ఇంటిపై దాడి యత్నం అధికార కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలని మండిపడ్డారు. ఎమ్మెల్యే సవాలును ఎదుర్కోలేక రౌడీలను పురమాయించడం ప్రతీకార రాజకీయమని విమర్శించారు.
VSP: 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరగనున్నాయి. గంగవరం గ్రామానికి చెందిన కనకరావు కుమారుడు తేజ ప్రస్తుతం అదానీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
RR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాద్ నగర్ పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్ మున్సిపల్ ఛైర్మన్ బస్వంను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మసీదుల వద్ద వీధి దీపాల ఏర్పాటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.
HYD: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి 14 వరకు జరిగే FIH హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం భారత మహిళల సీనియర్ హాకీ జట్టు కీలక పోరాటానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో విజయం సాధిస్తేనే వరల్డ్ కప్‌కు అర్హత లభిస్తుంది. వేగవంతమైన దాడులు, కట్టుదిట్టమైన రక్షణ, పెనాల్టీ కార్నర్ మార్పిడి జట్టు విజయానికి ప్రధానంగా మారనున్నాయి.
ప్రకాశం: కార్మికుల, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐకమత్యంతో పోరాడాలని సీపీఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రశేఖరపురం సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రెడ్ బుక్స్ డే కారుక్రమంలో భాగంగా చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనే అంశం గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవులను దోచుకోవడం నేటికీ కొనసాగుతుందన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలోని షాపుల యజమానులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ ఇవాళ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
SRPT: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఐడీఓసీలో తొమ్మిది ఆర్బీఎస్‌కే బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమిషానికి 100-120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు.
NLG: చండూరు పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. అనంతరం 50 జతల ఎద్దుల శకటంపై చేనేత మగ్గంతో పట్టు వస్త్రాల నేసే కార్యక్రమం, ఊరేగింపు జరుగనున్నాయి.
BHPL: రేగొండ(M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు గోరికొత్తపల్లి మండల నాయకులు హాజరై అన్నదానం వడ్డించి సహకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ ఓం ప్రకాష్, NSUI మండల అధ్యక్షుడు రంజిత్, మాజీ వార్డు మెంబర్ కుమార్, నాలుగో వార్డు మెంబర్ అనిల్ పాల్గొన్నారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని తెలిపారు.