• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డోన్లో బైక్–ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి

NDL: డోన్ పట్టణంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నయారా పెట్రోల్ పంపు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో ఆలంకొండకు చెందిన మునిరంగడు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు,కొడుకు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 08:00 PM IST

వైసీపీ దుశ్చర్యలను ఖండించిన ఎమ్మెల్యే

ELR: వైసీపీ సభ్యులు కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరును రాజకీయ లాభాల కోసం వినియోగించడం హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమేనని అన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం

E.G: చాగల్లు గ్రామ పంచాయతీలో గృహ నిర్మాణ ప్రగతిపై పీడీ హౌసింగ్ నాతి బుజ్జి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన 417 గృహాల నిర్మాణంపై ఆమె సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సమయానికి పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

కర్నూలులో టీడీపీ మండల నేతలకు దిశానిర్దేశం

KNL: జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకోసం కట్టుబడి పనిచేయాలని, యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ ప్రజలకు సంక్షేమ సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వరు ఉన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

మాజీ DCC అధ్యక్షుడు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

MLG: జిల్లా మాజీ DCC అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి మూడవ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కుమారస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

February 21, 2026 / 07:59 PM IST

చేనేతలకు టీటీడీ ఆర్డర్.. మంత్రి సవిత ధన్యవాదాలు

AP: ఆప్కో చరిత్రలో తొలిసారి టీటీడీ నుంచి కొనుగోలు అభ్యర్థన వచ్చింది. తొలివిడతగా 3 వేల కండువాలు, 5 వేల శాలువాలను తయారు చేయాలని టీటీడీ మార్కెటింగ్ అధికారులు సూచించారు. దీంతో చేనేతదారులకు 365 రోజులపాటు ఉపాధి కల్పన లభించనుంది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.

February 21, 2026 / 07:58 PM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

VKB: వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగిశాయని కుల్కచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తెలిపారు. గత ఐదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు గ్రామ పరిపాలనపై అధికారులు వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. 33 గ్రామ పంచాయతీల గాను మొదటి విడత శిక్షణ తరగతులు ముగిశాయని, మిగతా గ్రామ వార్డు సభ్యులకు త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు.

February 21, 2026 / 07:57 PM IST

అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు: MLA

GNTR: ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శనివారం మంగళగిరిలో TDP మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత యువకుడి హత్యకేసులో పాల్పడ్డ అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు అని, జగన్ పార్టీని వెంటనే సస్పెండ్ చేయాలి అని, దళితుల భద్రత, హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 07:56 PM IST

ధన్వాడ వాసికి అవార్డు

NRPT: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో ధన్వాడ యువ రచయిత, రంగస్థలం నటుడు మల్కమల్ల బాలకృష్ణ గౌడ్ పొట్లూరి హరికృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగు భాషకు చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేశారు.

February 21, 2026 / 07:54 PM IST

శిఖర్ ధావన్ పెళ్లి.. ఫొటోలు వైరల్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సహచర క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ధావన్‌కు తన మొదటి భార్యతో ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది.

February 21, 2026 / 07:53 PM IST

గద్వాలలో దివ్యాంగుల గ్రీవెన్స్ డే

GDWL: గద్వాల కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన దివ్యాంగుల గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు అందినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి నెల మూడో శనివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారని తెలిపారు.

February 21, 2026 / 07:52 PM IST

CMRF చెక్కులను అందజేసిన మంత్రి

GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 61 మందికి రూ. 46,59,619ల విలువైన చెక్కులను శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.

February 21, 2026 / 07:52 PM IST

న్యాయమూర్తులపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారు. దీనికి వారు సిగ్గుపడాలి. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు. మేం గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటాం’ అని వెల్లడించారు.

February 21, 2026 / 07:50 PM IST

రేపల్లెలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

BPT: రేపల్లె పట్టణంలో శనివారం ఆర్డీవో ఎన్ రామలక్ష్మి ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీరో వెస్ట్–లిట్టర్ ఫ్రీ గవర్నెన్స్ లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అనగాని శివ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.

February 21, 2026 / 07:50 PM IST

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఖండన

MBNR: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని జిల్లా ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధి ఇంటిపై దాడి యత్నం అధికార కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలని మండిపడ్డారు. ఎమ్మెల్యే సవాలును ఎదుర్కోలేక రౌడీలను పురమాయించడం ప్రతీకార రాజకీయమని విమర్శించారు.

February 21, 2026 / 07:50 PM IST