• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాధితులకు సహాయ సహకారాలు: అదనపు ఎస్పీ

MDK: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు చర్యలపై తెలుసుకున్నారు.

February 21, 2026 / 08:08 PM IST

మంత్రి పర్యట ఏర్పాట్లలో లోపాలు వద్దు: కలెక్టర్

GDWL: కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రోటోకాల్, భద్రతలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న రహదారులను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన హెచ్చరించారు.

February 21, 2026 / 08:06 PM IST

‘నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు.. ఎందుకు చేయలేదు’

AP: YCP నేతలకు దేవుడంటే భయం లేదని హోంమంత్రి అనిత తెలిపారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటో పట్టుకోవడం అపచారమన్నారు. వైసీపీ నేతలు చెప్పులు వేసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారని గుర్తు చేశారు. అయితే వీడియోలు రిలీజ్ చేశామని.. మరి రాజీనామా ఎందుకు చేయలేదని విమర్శించారు. రాజనీయానికి దేవుడిని వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

February 21, 2026 / 08:06 PM IST

రేపు విశాఖకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం

VSP: భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీ.వీ.ఆర్. సుబ్రహ్మణ్యం ఆదివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 23వ తేదీ ఉదయం 9 గంటలకు వాయు మార్గంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

February 21, 2026 / 08:05 PM IST

పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: CP

NZB: ప్రతీ సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, దీనిని సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు తమకు సమస్యలను పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించి వాటిని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 08:05 PM IST

నల్లమందు విక్రయం.. నిందితులు అరెస్ట్

TG: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో నల్లమందు విక్రయిస్తున్న నలుగురిలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ముగ్గురి నుంచి 2.7 కిలోల OPMను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, రూ. 50 వేలు కైవసం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

February 21, 2026 / 08:05 PM IST

‘ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి’

KNR: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో KNR, HUZ ఆర్డీవోలు, సమావేశమయ్యారు.

February 21, 2026 / 08:05 PM IST

పీయూలో చెస్, తైక్వాండో సెలక్షన్స్

MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 23న చెస్ మెన్ సౌత్ జోన్ ఎంపికలు, ఆలిండియా తైక్వాండో మెన్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు మార్చి 1-5 వరకు తిరుచిరాపల్లి సౌత్ జోన్ పోటీల్లో, తైక్వాండో క్రీడాకారులు మార్చి 2-6 వరకు జలంధర్‌లో జరిగే ఆలిండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 08:05 PM IST

‘వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి’

ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు రాందాస్, సంతోష్ రావు, అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ MLA

BHPL: రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు వీరునాయక్ -శాంతి కుమార్తె ఉమా – విజేందర్ వివాహ మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

పాక్-కివీస్ పోరుకు వర్షం అంతరాయం

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా, వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, రెండు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి.

February 21, 2026 / 08:03 PM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 22,303 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.

February 21, 2026 / 08:03 PM IST

మీసేవ మొబైల్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ

BDK: జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా శనివారం కొత్తగూడెం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.

February 21, 2026 / 08:02 PM IST

‘సీఎం, మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగేది ఏమీ లేదు’

WGL: జిల్లాలో సీఎం, మంత్రుల పర్యటనలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. HNK పట్టణ కేంద్రంలోని BRS కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి 2 రెండేళ్లు గడిచిన ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:02 PM IST

ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పీ. జగదీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో క్రైమ్ రేట్ తగ్గించాలని సూచించారు.

February 21, 2026 / 08:02 PM IST