• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గోపాలపురం కాలనీల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని పలు కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొన్నారు. కాలనీలలో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

February 22, 2026 / 03:43 PM IST

YCP హిందువుల మనోభావాలు దెబ్బతీసింది: బొజ్జల

AP: శ్రీకాళహస్తిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. YCP MLAలు, MLCలు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. YCP హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని MLA బొజ్జల సుధీర్ పేర్కొన్నారు. లడ్డూలోనే ఇంత స్కామ్ జరిగిందంటే ఇతర అంశాల్లో ఇంకెంత అవినీతి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని చంద్రబాబు, పవన్, లోకేష్‌ను కోరుతున్నామని తెలిపారు.

February 22, 2026 / 03:43 PM IST

ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ శిక్షణ శిబిరం

NZB: మగ్గిడి పాఠశాలలో 12 రోజులుగా సాగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలు, 14 మంది బాలురను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 24 నుండి మార్చి 1 వరకు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో జరగనున్న జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు.

February 22, 2026 / 03:42 PM IST

మంతన్డ్లో ఉచిత వైద్య శిబిరం

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

February 22, 2026 / 03:42 PM IST

‘మానసిక ప్రశాంతత కోసం హ్యాపీ సండే’

శ్రీకాకుళంలోని బలగమెట్టు సమీపంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఆధ్వర్యంలో ఆదివారం “హ్యాపీ సండే” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. నగరాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారుల మానసిక ప్రశాంతత కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు.

February 22, 2026 / 03:41 PM IST

BRS నేతలు విషం చిమ్ముతున్నారు: బల్మూరి

TG: మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు, BRS నేతలు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్‌ MLC బల్మూరి వెంకట్‌ విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతం శుభ్రపడితే HYD ప్రజలు ఎప్పటికీ CM రేవంత్‌ను గుర్తుపెట్టుకుంటారనే భయం BRS నేతల్లో ఉందన్నారు.

February 22, 2026 / 03:41 PM IST

‘రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు’

ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్-2026’ రెండో దశ కార్యక్రమాన్ని చేపట్టినట్లు SP నితిక పంత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించని వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుటామని అన్నారు.

February 22, 2026 / 03:40 PM IST

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త రూల్స్!

ఐటీ శాఖ ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ను ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఏడాదిలో రూ.10L దాటిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల వివరాలు నేరుగా ఐటీ శాఖకు వెళ్తాయి. ఆఫీస్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు వాడితే పన్ను పడుతుంది. అయితే, సిసి స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా వాడొచ్చు. ఇకపై క్రెడిట్ కార్డు దరఖాస్తుకు పాన్ తప్పనిసరి.

February 22, 2026 / 03:40 PM IST

కోదాడ పట్టణంలో ఫాగింగ్ షూరూ..!

SRPT: కోదాడ పట్టణంలో వ్యాధుల నివారణకు మున్సిపల్ యంత్రాంగం నడుము బిగించింది. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ ప్రారంభించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని వార్డుల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

February 22, 2026 / 03:39 PM IST

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

KMM: సింగరేణిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు, న్యూరో రిహాబ్ ఎడ్యుకేటర్ ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవి ఆధ్వర్యంలో ‘మిషన్ వాక్’ స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కారేపల్లి, భాగ్యనగర్ తండా సర్పంచ్లు మేదరి వీర ప్రతాప్, బానోత్ హీరాలాల్ కలిసి ప్రారంభించారు.

February 22, 2026 / 03:39 PM IST

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయం

BDK: మణుగూరు ప్రాంతానికి చెందిన సంతోష్ – రమాదేవి దంపతుల కుమార్తెలు లావణ్య మరియు వెంకట శ్రీల ఓణీల అలంకరణ వేడుకలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాలికలకు ఆశీస్సులు అందించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కుటుంబ వేడుకలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 03:38 PM IST

ఈనెల 24 ఆదిలాబాద్‌కు కేటీఆర్

ADB: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24 మంగళవారం జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే కార్యవర్గాలు తెలిపాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 03:38 PM IST

మంగళగిరిలో తప్పని ట్రాఫిక్ కష్టాలు

GNTR: మంగళగిరి మెయిన్ బజార్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీ వేళల్లో భారీ సరుకు రవాణా వాహనాలు తిరగడమే ప్రధాన కారణం. గాలిగోపురం నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ లేని సమయాల్లోనే సరుకు రవాణాకు అనుమతించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 03:38 PM IST

PGRSని సద్వినియోగం చేస్కోండి: కమిషనర్

GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.

February 22, 2026 / 03:38 PM IST

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్

KNR: కొత్తపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తన ఎన్నికల హామీని నెరవేర్చి నిబద్ధతను చాటుకున్నారు. 17వ డివిజన్‌కు చెందిన సిరిపురం స్వప్న మురళి కుమార్తె వివాహానికి హాజరైన ఆమె ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,016 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.

February 22, 2026 / 03:36 PM IST