KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
అన్నమయ్య: రామాపురం సుద్దమల్ల గ్రామంలోని ఓబుల్ రెడ్డిగారిపల్లె దిగువ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న శ్రీరామాలయ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఓ ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ.. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
CTR: బైరెడ్డిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎన్. అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం రూ.112.50 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తగా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.
MBNR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ ఎపిసోడ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, యువత ప్రేరణ, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
KRNL: మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆదివారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయులు టీడీపీ యువనేత రాకేష్ రెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి, సురేష్ నాయుడు, మల్లికార్జున, వెంకటేష్ ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు.
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో ఆదివారం YCP ఆధ్వర్యంలో ‘జనం మాట-జగనన్న బాట’ డిజిటల్ రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారి జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి మద్దతుగా తీర్మానం చేశారు.
మేడ్చల్: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 366వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులర్పించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా నాగర్ కర్నూల్లో చాకలి కులస్తులపై అగ్రకుల నేతల దాడి, 2 నెలల పసికందు మృతి దురదృష్టరమని అన్నారు.
TPT: అవిలాలలో జిల్లా TDP కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, MLC దీపక్ రెడ్డి, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ శంకుస్థాపన పునాది మాత్రమే కాకుండా కార్యకర్తల ఆశయాలకు శాశ్వత నిలయం అని తెలిపారు.
KDP: దిగువరాచపల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
ADB: తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే జాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి భక్తి భావాన్ని అలవరుచుకోవాలన్నారు.
గంటల తరబడి ఇయర్ ఫోన్స్ వాడితే చెవుల్లో గాలి ఆడక తేమ చేరుతుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అధిక శబ్దంతో వింటే శాశ్వతంగా వినికిడి శక్తి తగ్గొచ్చు. వీటిని వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువ ఉంచాలి. ప్రతి గంటకోసారి హెడ్‌ఫోన్స్ తీసి చెవులకు విశ్రాంతినివ్వాలి. ఇయర్ బడ్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.
SDPT: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జి సునీత తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, వారి అభిప్రాయాల సేకరణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
కృష్ణా: అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారు, ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ట వేద పండితులచే జరిపించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగస్వాములయ్యారు.
KNR: శంకరపట్నం నుంచి వీణవంక వైపు వస్తున్న ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆముదాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన ఆటో, రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ చింతల సంపత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.