• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

త్రాగునీటి సమస్యలకు పరిష్కారం: సర్పంచ్

కోనసీమ: కే. గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో ప్రజల రాగినీటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తోకల మంగ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామంలో నూతనంగా నిర్వహించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులు నెక్కంటి బాలకృష్ణ, గన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

‘కర్నూలులో న్యాయవాదిపై దాడి హేయకరం’

E.G: కర్నూలులో న్యాయవాది ఎం.పవన్ కుమార్‌పై 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, సిబ్బంది దాడి చేయడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు రాజమండ్రి సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

February 23, 2026 / 02:34 PM IST

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని తెలిపారు. మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన డ్రైవర్లు

KNR: డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 02:34 PM IST

సూళ్లూరుపేట టోల్ వద్ద కంటైనర్ కలకలం

TPT: సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద షాపుల ముందు ఉంచిన కంటైనర్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలిక చర్యగా దీనిని ఏర్పాటు చేశామని టోల్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కంటైనర్ కారణంగా రహదారి వెడల్పు తగ్గి వాహనాలు నిలిచిపోవడంతో రద్దీ మరింత పెరిగిందని స్థానికులు అంటున్నారు.

February 23, 2026 / 02:34 PM IST

అభివృద్ధికి బాటలు వేయాలి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

MDK: నర్సాపూర్ పురపాలిక నూతన పాలకవర్గం తొలి సమావేశం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం ఉత్సాహంగా సాగింది. తొలుత కౌన్సిలర్లు, సిబ్బంది మధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 02:32 PM IST

‘నిందితులను వెంటనే శిక్షించాలి’

NRPT: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో సోమవారం రజక, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చిన్నారి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిని వెంటనే చట్టరీత్యా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

February 23, 2026 / 02:32 PM IST

అగ్నిప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైన శ్రీ సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాపును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ప్రమాదంలో దుకాణానికి సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాదితుడు ఉపేందర్ తెలిపారు.ఈ సందర్భంగా షాపు యజమాని ఉపేందర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే ఘటన వివరాలు తెలుసుకున్నారు.

February 23, 2026 / 02:31 PM IST

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: రాజేందర్

WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSF తీవ్రంగా ఖండిస్తోంది. సోమవారం వరంగల్ జిల్లా కేంద్రంలో BSF ఉమ్మడి WGL జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని చంపిన అగ్రకుల (రెడ్ల) పెత్తందార్లను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:30 PM IST

టీడీపీ సీనియర్ నేత మృతి

కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.

February 23, 2026 / 02:30 PM IST

రక్షణ చట్టం కోసం న్యాయవాదుల మహాపాదయాత్ర

NGKL: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అచ్చంపేట బార్ అసోషియోషన్ న్యాయవాదులు చలో హైదరాబాద్ మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం దారుణమని బార్ అసోసియోషన్ అధ్యక్షుడు మస్తాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, రవికుమార్, వెంకటేశ్వర్ రావు, మల్లేశ్ ఉన్నారు.

February 23, 2026 / 02:30 PM IST

టీపీసీసీ చీఫ్‌ను కలిసిన వినయ్ రెడ్డి

NZB: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

February 23, 2026 / 02:30 PM IST

అసెంబ్లీలో రేపు కల్తీ నెయ్యిపై చర్చ

AP: లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు దాదాపు 4 గంటలపాటు చర్చించనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ను రద్దు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించనున్నారు.

February 23, 2026 / 02:28 PM IST

కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆందోళన

SDPT: సిద్దిపేట కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆందోళన చేపట్టింది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ వద్దకు విచ్చేశారు. కలెక్టరేట్ కార్యాలయ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:28 PM IST

తాడ్వాయి ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

MLG: తాడ్వాయి(మం) కామారం క్రాస్ వద్ద సోమవారం, అతివేగంతో దూసుకొచ్చిన ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఏటూరునాగారం(మం) రామన్న గూడెం స్థానిక నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై నవీన్ మృతదేహం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 02:28 PM IST