• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి’

PPM: జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.

February 24, 2026 / 11:24 AM IST

పాడి పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: MLA

BPT: వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన పాడి పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం అసెంబ్లీలో విమర్శించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన వెటర్నరీ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు, అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 11:23 AM IST

డ్రగ్స్ నిర్మూలన సైకిల్ యాత్రలో పాల్గొన్న కలెక్టర్

NTR: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని సూచించారు.డ్రగ్స్ నిర్మూలన కోసం సమాజం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 24, 2026 / 11:23 AM IST

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

BDK: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.

February 24, 2026 / 11:22 AM IST

డేంజర్ జోన్‌లో మన ‘HYD’

HYDలో ఎయిర్ క్వాలిటీలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌‌క్వాలిటీ మంగళవారం వట్టినగులపల్లిలో షాకింగ్‌గా 571గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 24, 2026 / 11:21 AM IST

11వ వార్డులో పారిశుధ్య పనులు

VKB: పరిగిలోని 11వ వార్డులో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా కౌన్సిలర్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ ఎండీ అజాజ్ ఆయన మురుగునీరు నిల్వ, నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సహాయంతో నాలాలను శుభ్రపరిచి చెత్తను తొలగించే పనులు చేపట్టించారు.

February 24, 2026 / 11:21 AM IST

వనపర్తి పాత బస్టాండ్ సమస్యలు

WNP: వనపర్తి పాత బస్టాండ్‌లో తాగు నీరు, సరియైన కూర్చీలు, వేచిచూడే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. కేవలం ఒక షెడ్డు, 4 కుర్చీలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ బస్సులు బస్టాండ్‌కి రాకుండా రాజీవ్ చౌరస్తాలో ఆగి వెల్లిపోతున్నాయన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని అదికారులను కోరారు.

February 24, 2026 / 11:21 AM IST

బాలకృష్ణతో దర్శకుడు పూరి మరో మూవీ?

నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య కోసం, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం పూరి చేశాడట. అయితే బాలకృష్ణకు కథ వినిపించాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా, గతంలో వారి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

February 24, 2026 / 11:20 AM IST

‘దిశ సమావేశానికి అధికారులు సిద్ధంగా ఉండాలి’

KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించి, ఈ నెల 27న జరిగే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు.

February 24, 2026 / 11:18 AM IST

కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని కొనియాడిన సీఎం

అన్నమయ్య: జిల్లా జలధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో జిల్లా జలధార, కలెక్టర్ నిశాంత్ కుమార్ ఫొటోను షేర్ చేసిన సీఎం, ఏడాది కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. 25వ స్థానంలో ఉన్న జిల్లాను రెండో స్థానానికి తీసుకురావడంలో కలెక్టర్ కృషి కీలకమని కొనియాడారు.

February 24, 2026 / 11:18 AM IST

మహిళలపై నేరాలు పెరిగాయి: వరుదు కళ్యాణి

AP: కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల‌పై నేరాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ‘గంజాయి లేదని హోంమంత్రి అంటున్నారు. మదనపల్లిలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి డ్రమ్ములో వేసి చంపారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది’ అంటూ ప్రశ్నించారు.

February 24, 2026 / 11:17 AM IST

గురుకుల హాస్టల్‌లో క్షుద్ర పూజల కలకలం

JN: పాల‌కుర్తి (M) గూడురు గిరిజ‌న‌ బాలిక‌ల వ‌స‌తి గృహంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. హాస్టల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసి పసుపు, కుంకుమ, బొమ్మలు లాంటివి వేస్తున్నారని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 11:16 AM IST

రెండు కొండలన్నారు: కూన రవికుమార్

AP: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏడుకొండలు కాదు.. రెండు కొండలు అన్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ గుర్తు చేశారు. పోరాటాలు చేసిన తర్వాత నాటి జీవోను మళ్లీ వెనక్కి తీసుకున్న పరిస్థితి చూశామని తెలిపారు. పింక్ పేరుతో అసత్య ప్రచారం, అభూతకల్పనలు చేసి అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు. కోర్టులో కేసు కూడా దాఖలు చేసి రూ.2 కోట్లు ఫీజు చెల్లించారన్నారు.

February 24, 2026 / 11:15 AM IST

విద్యాపీఠం సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్

సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్ వాస్తు విద్యాపీఠాన్ని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అయితే ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాలని చైర్ పర్సన్ సిద్ధాంతిని ఆహ్వానించారు.

February 24, 2026 / 11:14 AM IST

గాలివాన బీభత్సం.. పలుచోట్ల కూలిన చెట్లు

SRPT: మేళ్లచెరువులో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో జనజీవనం సంధించింది. గాలి దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మిర్చి ఏరుతున్న దశలో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు రేపు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.

February 24, 2026 / 11:14 AM IST