దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 694.13 పాయింట్లు నష్టపోయి 82600.53 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201.90 పాయింట్ల నష్టంతో 25511.10 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.96గా ఉంది.
HNK: ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కజ్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న సాయంత్రం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో రూ. 8 లక్షల విలువచేసే 20 లాప్టాప్‌లు విద్యార్థులకు అందించినట్లు పేర్కొన్నారు.
TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. పూరిళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాళీ చేసేందుకు స్థానికులు గడువు కోరుతున్నారు. కాగా, భూదాన్ భూవివాదం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోంది. 31 ఎకరాల్లో స్థానికులు పూరిళ్లు వేసుకున్నారు.
NRML: రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆయా ప్రైవేట్ కళాశాలలు హాల్ టికెట్లు జారీ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు నెట్ నుండి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ పరుశురాం నేటి ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే విద్యార్థుల మొబైల్ ఫోన్లకు హాల్ టికెట్ లింకును పంపించామని తెలిపారు.
NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం కింద నిర్మించిన గోశాలను (కమ్యూనిటీ గోకులం) ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.రూ.10 లక్షలతో నిర్మించిన గోశాల గ్రామంలోని పాలు ఉత్పత్తి చేసే రైతులకు మేలుకలుగుతుందని, పశుసంవర్థక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.
AP: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త కొడవలితో నరికాడు. తీవ్రగాయంతో ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య గౌరమ్మ చికిత్స పొందుతోంది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్త నాగభూషణం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి KNR జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. KNRలో 36,426, PDPLలో 10,367, JGTLలో 15,125, SRCLలో 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులు 45 ని.లు ముందే సెంటర్‌కు వెళ్లాలన్నారు.
JN: దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో నేడు అంతరాయం కలుగుతుంది అని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన 700mm WBSC లీకేజీ కారణంగా సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు అని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి మంచి నీటికోసం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు.
MBNR: హన్వాడ పోస్ట్ ఆఫీసులో జిల్లా పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో సమావేశమయ్యారు. సేవింగ్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి, బీమా వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసి అందరూ వినియోగించుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పోస్టుమాస్టర్ చంద్రశేఖర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో రహదారి వేయడానికి వీలుకావడం లేదు. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జన్నారం శివారులోని జింకల పార్కు నుండి రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
RR: చేవెళ్ల మండలంలో భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్ అన్నారు. మండలంలో మొత్తం రైతులు 32,650ల మంది ఫార్మర్ రిజిస్టేషన్‌కు అర్హులుగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని గుర్తించాలని సూచించారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన అభ్యుదయ కవి కొండ లింగారావుకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో. నిర్వాహకులు ఆయనను సార్ తో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు. విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో ఆయన టాప్ 20 విజేతగా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక గ్లింప్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే 2026 జూన్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.
NLR: ఉదయగిరి పోలీసులు ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఉదయగిరికి చెందిన ఓ బాలుడు, బాలికకు గతేడాది పరిచయమైంది. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలుడు శారీరకంగా లొంగదీసుకుని గర్భిణిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై కేసు నమోదు చేశారు.