KMM: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించవద్దని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జీ. లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం KMM కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు దక్కే ప్రయోజనాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాజు (17) అదృశ్యమయ్యాడు. ఈనెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి డేవిడ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విక్రమ్ కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని తెలిపారు. పోలీసులు మిగిలిన వివరాలను పరిశీలిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి దాల్చిన చెక్క అద్భుత వరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు దీన్ని వాడటం లేదా దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది బరువు తగ్గించడమే కాకుండా.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు, ఇతర ఉదర సంబంధిత సమస్యల నివారణకు ఇది తోడ్పడుతుంది.
JN:చిప్పరాళ్లబండ తండాకు చెందిన నానునాయక్ తన భార్య దస్లీ మరణాన్ని తట్టుకోలేక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసిన తర్వాత, ఆమె జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి ముసుగేసి ఉంచాడు. బతుకులోనూ, మరణంలోనూ ఆమెకు తోడుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP: తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో తొలుత కేసు నమోదైందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైందన్నారు. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ పునర్ వ్యవస్థీకరించడమైందన్నారు. 2014 నుంచి ఈ-టెండర్ల ద్వారా అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,510 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,400 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.36,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.18,300, ఎల్లో మిర్చి రూ.25వేలు పలికాయి. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
అనకాపల్లి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటలు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ల అయ్యన్నపాత్రుడు శాసనసభలో తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 3 రోజులు పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బహుమతి ప్రధానోత్సవానికి కుటుంబ సభ్యులతో హాజరు కావాలన్నారు.
KRNL: కౌతాళంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఇవాళ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పట్టాభిలు టీడీపీ, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 44 ఏళ్లుగా తమ కుటుంబం పార్టీకి సేవలు అందించినప్పటికీ, ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఎంపిక విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.
ATP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ పోస్టర్లను విడుదల చేశారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశం కోరే విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు రక్షణ చట్టం కోసం చేపట్టిన మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. నేడు జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్రను అలంపూర్ నియోజకవర్గ న్యాయవాదులు యాకోబు, నరసింహులు నిర్వహిస్తున్నారు. అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాత్ర సెక్రటేరియట్ వరకు కొనసాగనుంది.
ADB: ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సిరికొండ, ఇచ్చోడ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
NRPT: ఉట్కూర్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరును జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మహిళలకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రసవాలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ను కోరారు.
HYD: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి మొత్తం నాలుగు కోర్సులు మంజూరైనట్లు అధికారులు తెలియజేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ నాలుగు విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనుమతి ఇచ్చింది. మాస్టర్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సులకు అనుమతి లభించినట్లుగా డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. మొత్తం 16 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రాబోతుంది. ఈ మూవీతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందనున్నట్లు టాక్.
E.G: దేవరపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారాయని వాపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.